మునుపటి నా మాట
బొమ్మలు గీసి, ఆ బొమ్మలకి కిసుక్కున నవ్వు తెప్పెంచే వ్యాఖ్య రాసి తెలుగు వాళ్ళ ఆరోగ్య పధకానికి ఎప్పుడో నాంది పలికిన ద్విజులు సత్తిరాజు లక్ష్మినారాయణ, ముళ్ళపూడి వెంకట రమణ. ఆ ముందాయన పేరుందే అది పెద్దగా ఉందా ? సరే. ఎవరక్కడ? చిత్తం. 'బాపు' అనే పేరును వెంటనే ఇక్కడ ప్రవేశ పెట్టండి. చిత్తం, మరి ఇంకో బాపు - మనకి స్వతంత్రం తెచ్చిపెట్టిన బాపు ఉన్నారే.... 'తెలుసులేవోయి. ఈయనా గొప్పే. ఎటొచ్చీ బొమ్మలు గీయడంలో మా గొప్ప స్వతంత్రం తీసుకు వచ్చ్చాడు'. 'అలా చెప్పండి. మరి ఆ రెండో ఆయన పేరు చాలా పొడుగు...' 'అతను తెలుగు వాళ్లకి బుడుగు' 'ఆ గదిలో ఎవరో లాఫింగ్ క్లబ్బు ట--తెగ రెచ్చి పోతున్నారు' 'నవ్వాపుకోలేక దగ్గి దగ్గి కళ్ళనిండా నీళ్ళు నింపుకునీ మీకెవరైనా ఎప్పుడైనా ఎదురు పడితే కచ్చితంగా వాళ్ళు బాపు కార్టూన్లు చూసి వస్తూ ఉండాలి లేదా ముళ్ళపూడి కథలు చదువుకొని వచ్చి ఉండాలి. పొరపాట్న మీరు ట్రైన్లో ఏ పాట్నాకో, విశాపట్నంకో బయలుదేరినట్లయితే, మీతో పాటూ బాపు కార్టూన్ల పుస్తకం ఉన్నట్టైతే, మీది కింది బెర్తు అయినట్టయితే జర భద్రం కొడకో --మీరు అస్తమానూ నవ్వుతుంటే ఎదుటి వాడు కాంప్లెక్సు లో పడి ఆత్మన్యూనతా భావంతో ఏదైనా 'ఓఘోయిత్యం' చేసుకోవచ్చు. అందుకనీ ఎంచక్కా పై బెర్తు ఎక్కేసి కడుపారా నవ్వుకోండి.
ఈ డాక్టర్లు ఇద్దరికీ కలిపి ఒక పద్మ అవార్డు ఎలా ఇవ్వడమో ప్రభుత్వానికి తెలియటంలేదు. ఆ కోపంతో ఎన్నో స్వచ్చంద సంస్థలు వారికి అడపా దడపా అవార్డులు ఇస్తున్నాయి. వారికి చెన్నైలో ఘంటసాల పురస్కారం ఇటీవల లభించింది. కనులు తెరచినా పాటే, కనులు మూసినా పాటే లో చూడండి,వినండి.. బాపురే రమణీయం! (మహాబలిపురం చెన్నై సముద్ర తీరం లోనే ఉంది కదా -- బాలరాజు ఏమంటున్నాడో బాపు ఏం చూపిస్తున్నారో వినండి, చూడండి) చిరునవ్వులోని హాయి లో కార్టూన్లు ఉన్హ ఉన్హ ఉన్హాయి. ఇదే ఈ పూట నా మాట... -డాక్టరు (వైద్యుడు కాదు) తాతిరాజు వేణుగోపాల్ (12.2.2011)
2 Comments
27/5/2013 07:00:53 am
BAPU 'RAY' chaalaa baagundi. Doctor ni vaidyudu kaadanadamu adi koodaa bapu 'ray" prabhaavame anipinchiMdi. You were introduced to me by my friend Sri KVSastry, probably u may know him @Pune. Good posting Sri Venugopal.
Reply
Tatiraju Venugopal
27/5/2013 09:15:21 am
Dhanyudanaitini ....appatiki inkaa baapu gaariki padmashree raaledu. ramana gaari shaashwata viramana choosi letugaa baadhapadi baapu gaariki padmashree ichhaaru. deenni padmashree ane kannaa ubhayashree ani andam melu. ee paata vraatalalo konni maarpulu gamanichaanu. savaristanu.
Reply
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|