మునుపటి నా మాట
0 Comments
రాజమండ్రి ద్వారా 'స్వరబ్రహ్మ'గా బిరుదు పొందిన గోదావరి లాంటి శాంత మూర్తి , మామ అని మొత్తం సినీ పరిశ్రమ ముద్దుగా పిలుచుకునే దగ్గరి బంధువు మహదేవన్ మనకి దూరమై పదేళ్లు గడిచాయి. 2001 లో జూన్ 21 న ఆయన గంధర్వ లోకంలో ఏం పనుందో కానీ ఏడు స్వరాలూ, ఎనిమిది పదుల వయసూ దాటి వెళ్లి పోయారు. మామ లేని సినీ లోకం పుట్టింట అమావాస్య చీకటి ఆవరించింది. ఆయన పూర్తి పేరు లో తొలి పొడి అక్షరాలు ‘కె.వి.’ అంటే ఆయన పవర్ తెలిసిన వాళ్ళు కె అంటే కెరటంలా వి అంటే విరుచుకు పడే సముద్ర గంభీరుడు అంటారేమో. ఎందుకంటే మామ మాట్ల్లడేదీ పొడి పొడి గానే. 'దొంగలున్నారు జాగ్రత్త' (1958) – హఠాత్తుగా ఈ నోటీస్ బోర్డ్ ఏమిటా అనుకునేరు. ఈ వింత టైటిల్ ఉన్న సినిమా మామ తొలి తెలుగు సినిమా కావడం ఆయనకది ఆయన లేని కాలంలో బాగా ఉపకరించింది. ఎందుకంటే ఆయన కట్టిన బాణీలు ఇప్పటికీ మక్కీ కి మక్కీ దించేసి పబ్బం గడుపుకున్న వారూ ఉన్నారు. ఈ తొలి సినిమా లో మామ బాణీ కొంచెం వేరుగా ఉంటుంది. కావాలంటే 'ఏమనెనోయి ఆమని రేయి' అన్నజిక్కి-ఘంటసాల యుగళ గీతం విన్నారనుకోండి, మీరూ అవునంటారు. తొలి సినిమా లో తొలి ఋతువు 'ఆమని' మాట వచ్చేలా పాట రావడం ఆయన అదృష్టం. ఆ అదృష్ట రేఖ గీసింది ఆత్రేయ గారే. అందుకే నేమో వారి అనుబంధం 'ఆత్రేయ-మహదేవన్' వెరసి తమిళ పదం 'ఆమ', అంటే తెలుగులో అవును అని అందరిచేతా అనిపించింది. వయసు గుర్తుచేస్తేనే తప్ప ఆ ఇద్దరు కళాకారుల్ని 'వృద్ధులు' అనడం తప్పు. వారి వారి క్షేత్రాల్లో వారి జీవితాలు వృధా పోనివ్వ కుండా కల్ప వృక్షాల్లా ఎదిగిన వారిద్దరూ 'నిత్య యవ్వనులే'. ఒకరు- నాట్య కళా చంద్రుడికి నవ్య వెన్నెల వెలుగులు ప్రసాదించిన 'నటరాజ రామకృష్ణ', మరొకరు- చిత్ర కళా రవికి చిత్ర విచిత్ర వన్నెలు , వెలుగులు సమకూర్చిన ' యమ్.యఫ్. హుస్సేన్'. 'నటరాజ' అన్నది ఒకనాడు మహారాష్ట్ర మహారాజు రామకృష్ణుల వారికి ఆయన పద్దెనిమిదేళ్ల ప్రాయం లోనే చూపించిన నాట్య ప్రతిభను మెచ్చి ఇచ్చిన బిరుదు. 'పద్మశ్రీ' భారత ప్రభుత్వం ఇచ్చిన మరో బిరుదు. ఆయన పరిశోధకుడు కనుక 'డాక్టర్' కూడా (ఏ.పి. సంగీత అకాడమీ -భరత కళా ప్రపూర్ణ, ఆంధ్ర విశ్వ విద్యాలయం-కళా ప్రపూర్ణ). |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|