Menu
రండి రండి రండి దయచేయండీ
నేనంటే నేనే…
శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవ సందర్భంలో ఒక ఆలోచన, వచ్చింది. నాకంటూ ఒక బ్లాగు కూర్చుకొని నా భావాలు మీతో పంచుకోవడం, మీ భావాలు చేర్చుకోవడం వంటి ఒక మంచి పనికి స్వీకారం చుడితేనో? వృత్తి రీత్యా వాతావరణ శాస్త్ర సైంటిస్ట్ ని. ప్రవ్రుత్తి రీత్యా వీలు చేసుకునీ అడపా దడపా పాటలు, కవితలు, చిట్టి వ్యాసాలు రాస్తూ ఉండే ఫైన్ ఆర్టిస్ట్ ని (అంటే బాగా రాస్తాననో, బొమ్మలు గీస్తాననో అనుకునేరు). అలా వచ్చిన వాటిని మీలో కొందరు చదివే ఉంటారు. చదవని వారు మొహమాట పడనక్కర లేదు. ఇక్కడైనా కనీసం చదివేయగలరు. ఆ ధీమా తోనే నా ఆలోచన పక్కన ఓ కామా చేరుస్తున్నాను, దాని పేరే మీ 'ప్రోత్సాహం'
మా వూరు బరంపురం. ఇది ఒడిశా లోని గంజాం జిల్లా లో ఉంది. ‘పట్టు’కి పట్టుకొమ్మ, ఘాటైన (కిల్లీ) మసాలాకి మహా వృక్షం. పుట్టుక, బడి చదువూ,కాలేజీ చదువూ, యూనివర్సిటీ చదువూ అన్నీ అక్కడే. అలా పట్టుబడిన తెలుగు మాకు పుట్టుక నుంచే వెలుగు. ప్రవాసాంధ్రుల భాగ్యమేమిటంటే వారికి మరో భాష ఉచితంగా అలవడుతుంది. తెలుగు చిలక సరసంగా పలికితే ఒరియా 'చిల్కా సరస్సు' గల గల మనడం మాకు తెలుసు.
బెంగళూరు, న్యూ డిల్లీ దాటి ప్రస్తుతం పదిహేను ఏళ్లుగా మహారాష్ట్ర లోని పుణ్య నగరి పూణే లో స్థిర పడిన వాణ్ని. కాబట్టి అప్పుడప్పుడూ సోదర భాషల గొప్పతనాన్నీ ప్రస్తావిస్తూ ఉంటాను.
[ఈ బ్లాగు పేరు లోని 'కృష్ణ' మా దేవుడు మావయ్య పేరు, 'ప్రేమ' మామంచి మా అమ్మ పేరు-మా అమ్మమ్మ, తాతగారు అమ్మను అలా పిలిచే వారు- నా రెండేళ్ళ ప్రాయంలో నాన్నను దేవుడు ఏదో మా నాన్నతోనే పనుంది అన్నట్టు రమ్మని కబురంపాడు. ఇక అప్పటినుంచి వీరే మాకు అన్నీ అయి పెంచేరు.
శ్రీ వెంకట రమణ మూర్తి ఆశీర్వాదమంటే పై లోకం నుంచి మా నాన్న దీవిస్తున్నట్టే కదా ( మా నాన్న వెంకట రమణ, అమ్మ పద్మావతి - కాబట్టి మా ఇల్లే తిరుమల- వారి తీపి జ్ఞాపకాలే మాకు నిత్య లడ్లు).
ఎందరో మహానుభావులు—-అందరికీ వందనములు.
ఈ బ్ల్లాగు తోటలో ఆరు మొక్కలుంటే బాగు బాగు అనిపించింది. మొదటిది -'ఈ పూట నా మాట' అన్న మొక్కకి రోజూ కాకపోయినా అప్పుడప్పుడూ లేదా ఓ సందర్భం వచ్చినప్పుడు మాటల నీళ్ళు పోయడం అనేది ఉంటుంది. రెండవ మొక్క- 'పాటల కొలువు'. ఇదేదో బొమ్మల కొలువులా వినిపిస్తోందా? ఎటొచ్చీ ఇందులో పాడే బొమ్మల కదలికలు (వీడియో), బొమ్మగా కనిపించనివి వినిపించే పాటలు (ఆడియో), అచ్చు గ్రుద్దిన పాట (ప్రింట్) అనేవి కొలువు తీరి ఉంటాయి. మూడవ మొక్క- 'అచ్చం అవే అచ్చులు'. ఇందులో మళ్ళీ రెండు కొమ్మలు- ఒక దాంట్లో 'తిరుగు లేని మాట' గా అంటే ప్రముఖుల రచన ఉంటే రెండో దాంట్లో పాటని పోలిన పాట లేదా ఒక ఒక పాట లాగే కనిపించినా ఎక్కడో కొంచెం వేరుగా ఉండే ఇంకో పాట ఉంటాయి. దీనికి 'పాట = తిరుగు టపా' అన్నాను.
నాల్గవ మొక్క- 'చిరునవ్వు లోని హాయి'. ఇక్కడ హాస్యం ఉంటుంది. నాలుగు హాస్యం శాఖలు చూడవచ్చు. అయిదవ మొక్క -మిత్రుల పత్రాలు. అంటే మీ పేజీ అన్న మాట. ఉన్న మాట చెబుతారన్నమాట. ఇక్కడ తెలుగే రాయాలనేం లేదు. ఇంగ్లీషు లోనూ రాయొచ్చు.
చివరాఖరి మొక్క - 'ఆహాహా----అహ్హహా'. అంతే కదా- మన మనసుకి నచ్చేది మన ముఖ కవళిక నుంచి మన గొంతు రవళించడం లోకి మారేటప్పుడు వినిపించేది - 'ఆహాహా. ఇందులో ఫోటోలూ, రేఖా చిత్రాలూ ఉంటాయి.
ఇదే షడ్రుచుల విందు. అందుకే రండి రండి రండి దయ చేయండిందు.
(click here for my profile)