కృష్ణ ప్రేమ
Menu

నా నుడి – ‘న్యూ’ నుడి 

-ఎంతటి కంప్యూటరైనా  కరెంటుకి లోకువే

-అడ్వాన్సు తగ్గిస్తా కానీ అద్దె పెంచనీ అన్నాట్ట

-ఎంత చెడ్డా ఇంటి ఓనరూ ఓ నరుడే

-పురుషుడి ‘ఠీవి’ కి ఓ తోడూ స్త్రీ ‘టీవి’కి ‘ఓ నీ డా’ కావాలి

-రెంటు తక్కువైన ఇంటికి కరెంటు ఖర్చు ఎక్కువైనట్టు

-మార్నింగ్ వాక్ అని చెప్పి మారుతీ లో బయలుదేరినట్టు

-సున్నా ఆదాయం వరుడికి సున్నుండలు కూడానా?

-అప్పిచ్చేవాడికి అదే పనిగా దండాలు

-‘కార్లో లిఫ్టు ఇస్తారూ’ అంటే ‘కాస్త పెట్రోల్ పోస్తారూ’ అన్నాట్ట.

-కట్నం కోరని కుర్రాడా అయితే కనుక్కోండి వంకరేమో అన్నట్టు

-తాత  ITI,  తండ్రి  IIT, తాను   IT

-చెన్నై హోటల్ లో ‘నాన్ వెజ్ దా’ అంటే ‘ఉన్నై అరటిపళ్ళు ఇందా’అన్నట్టు 
---------------------------------------------------------------------

కొత్తగా పెళ్లయినా కొట్టుకుంటున్నారు మొగుడూ పెళ్ళాం.
మొగుడు: 'నువ్వు వస్తావా రావా? నే వెళుతున్నా ఇరాను'
పెళ్ళాం: 'రాను'
మొగుడు: 'సరే , వెళ్లి రానా ఇరాకు?'
పెళ్ళాం: 'రాకు' 
-----------------------------------------------------------------------

పేరడీ పాట: మూలం- 'నేలతో నీడ అన్నది నను తాక రాదనీ'

పేడతో పిడక అన్నది నను మలచ రాదనీ 
ఆవుతో పేడ  అన్నది నను విడువ  రాదనీ  
ఆవు తన్ను మేయ రాదనీ గడ్డి పరక అన్నది
నేడు గడ్డినే వేయరాదనీ ఒక పధకమున్నది
 
గ్యాసు పొయ్యి వెలగనిదే వంట  పని  ముగిసేనా
మిక్సీ తను  తిరగనిదే పచ్చడి బద్ద నలిగేనా  
కూర పప్పు కుదరనిదే చారు పులుసు ఉడకనిదే
ఫుడ్డు లేదు గిడ్డు లేదు అప్పడాలే  లేవులే   

వంట ఇంటి పెనము వేయించే గుణము 
అనాదిగా స్త్రీ జాతికి అదే మూల ధనము 
ఇక ప్రాచీనం  పురాతనం ఒక కేజీ పిడకలనివార్యం 
ఒలుచు కొనుట  నీ ధర్మం -ఒలవకుంటే నీ ఖర్మం


------------------------------------------------------------------------------------------------
పేరడీ పాట: మూలం- 'పల్లెకు పోదాం పారును చూదాం చలో చలో'

ఫుల్లుగ కొడదాం బారుకు పోదాం చలో చలో
మెల్లగ లేద్దాం చలో చలో     ||ఫుల్లుగ||
గ్రద్ద వాలే సందులోనే మొండిగ వాలేము  ||ఫుల్లుగ||

ఛోటా  పెగ్గు మందు దట్టించు కొంత ఉప్పొంగి  ||ఛోటా||
బుసలేమో ఎక్కువేమో ||బుస||
పడవేమో పడేమో
తెలవార్లు చూతము    ||ఫుల్లుగ||

బిల్లూ చూడగానే బతిమాలి  పరుసు చూపేనో
నా తలని నిమురునో || నా తలని ||
తా నులిమి పోవునో ఏమౌనొ చూతము  ||ఫుల్లుగ||

--------------------------------------------------------------------------------------------------
పేరడీ పాట: మూలం: పగలే వెన్నెల జగమే ఊయల

పొగలే ఎక్కువ సెగలే తక్కువ
వదినే పూనుకొని వంట వార్చితే..ఏ..ఏ .. ||పొగలే||

గిన్నె లోని ముక్కలన్ని మాడిపోయే
అట్లకాడ రూపు మారి ఊడిపోయే
ఈ అన్న రాణియే ఏడుపు వాణియై
గదిలో దూరి తలుపు మూసుకోదా...      ||పొగలే||

వడలు చేయ వదినగారు  పెరుగు పోసె
మినప సున్ని తిన్న నాకు జొరము వచ్చె
ఈ అన్న విందులే మరలా చిందులై
ఇకపై భోజనాలు నిలిచి పోవా ....           ||పొగలే||

తోటకూర కాడ లేయ  తొలుత మాడె
చాలబరువు బుక్కు చూసి సగము వండె
పెసలే నోటిలో కరకర లాడగా
పండ్లే  సన్నవిగా విరిగి పోవా ....            ||పొగలే||


--------------------------------------------------------------------------------------------------
Powered by Create your own unique website with customizable templates.
  • మునుపటి నా మాట
  • కనులు పాట పాడునని...
    • కనులు చూసినా పాటే... (Video)
    • కనులు మూసినా పాటే... (Audio)
    • కనులు చదివినా పాటే... (Readio)
  • అచ్చం అవే 'అచ్చు'లు
    • పాట = తిరుగు 'టపా'
    • తిరుగులేని మాట
    • తీరైన మాట
  • పొట్ట చెక్కలు
    • బాపురే రమణీయం >
      • బాపు గీత
      • రమణ రాత
    • గోప్యం....మాయ కానీయం >
      • అచ్చోసిన సొంత కితకితలు
      • అచ్చుకాని సొంత పక పకలు
  • బొమ్మ-లాంతరు
    • ఆల్ 'బొమ్మ'లే....
    • తెలిసినదే ... మళ్ళీ
  • Net Post
  • మునుపటి నా మాట
  • కనులు పాట పాడునని...
    • కనులు చూసినా పాటే... (Video)
    • కనులు మూసినా పాటే... (Audio)
    • కనులు చదివినా పాటే... (Readio)
  • అచ్చం అవే 'అచ్చు'లు
    • పాట = తిరుగు 'టపా'
    • తిరుగులేని మాట
    • తీరైన మాట
  • పొట్ట చెక్కలు
    • బాపురే రమణీయం >
      • బాపు గీత
      • రమణ రాత
    • గోప్యం....మాయ కానీయం >
      • అచ్చోసిన సొంత కితకితలు
      • అచ్చుకాని సొంత పక పకలు
  • బొమ్మ-లాంతరు
    • ఆల్ 'బొమ్మ'లే....
    • తెలిసినదే ... మళ్ళీ
  • Net Post