కృష్ణ ప్రేమ
Menu

చమత్కారాలు - చ! మిరియాలు 

ఆంధ్రప్రభ  స.వా.ప.13.10.1993, 8-3-1995,    ‘తేనె పట్టు’

చొప్పదంటు ప్రశ్న అంటే ఏమిటి?

స. సూట్ కేసుల్లో ‘కోట్లు’న్నాయంటే  పోన్లే చలికాలం అని ఎందుకనుకోకూడ దండి?

పురుషులు తపస్సు చేస్తే దేవకన్యలు వస్తారు. మరి స్త్రీలు తపస్సు చేస్తేనో?

స. ఇదియే దేవ రహస్యం. వారు దేవ కన్యలు గా మారిపోతారు.

కల్లు కుండలోనే ఎందుకు పడతారు? బిందెలో ఎందుకు పట్టరు?

స. పానకం బిందె వేరే ఉండనే ఉందిగా! ఎటొచ్చీ పూనకం లోనే తేడా అల్లా!

 -టి. వేణుగోపాల్ , న్యూ డిల్లీ
------------------------------------------------------------------------
హాసం  ( హాస్య-సంగీత పత్రిక )

డబుల్ రోల్ , హాసం 1-15 ఆగస్టు 2003

అలా బెల్లం కొట్టిన ‘రాయిలా’ కూర్చున్నావేం? – ‘రా....యిలా’

డబుల్ రోల్ , హాసం 1-15 ఫిబ్రవరి  2004

ఏ మోడల్ చూసినా ఏమో డల్ గా అనిపిస్తోంది 

ఇదా? నిమ్మ చెట్టు. ఇది దానిమ్మ కదూ?

మీ మాంసకృత్తులు అసలు బలమిస్తాయా అన్నదే మా ..... మీమాంస

డబుల్ రోల్ , హాసం 1-15 ఏప్రిల్  2004

నాన్చారమ్మా, మీ వారు అసలు సంగతి చెప్పక బాగా నాన్చారమ్మా

పేరున్నకొబ్బరినూనే అయినా అలా పేరు కుందేం?

మండి పోయే ధరలు ఈ డిపో వే

మనకు మీ, నా అనే భేదాల్లేవు మీనా

డబుల్ రోల్ , హాసం 1-15 మే  2004

నా జేబు రుమాళ్ళు ఎలా పోయాయో ఆ పెరుమాళ్ళు కెరుక

ఈ గోరింట టాగోరింట లేదు

నా రివాల్వర్ లోని గుళ్ళు గురి తప్పి నలుగురిని గాయ పరిచాయి

డబుల్ రోల్ , హాసం 1-15 జూన్  2004

కొత్త తారు రోడ్డిది, జాగ్రత్త. అంటుకు పోతారు.

గబుక్కున లాగడంలో ఆ బుక్కు చిరిగింది

పలావు తినే కదా ఆవిడంత లావు అయింది

ఇంక డౌట్  లేదు, వాడౌట్ అయిపోతాడు

హాసం వచ్చిందంటే చాలు ఆహా సంతోషం 

(పుణే నుంచి వేణుగోపాల్)

-------------------------------------------------------------------------------
'అమ్మయ్య ఇప్పటికి తన కాళ్ళ మీద తాను నిలబడగలుగుతున్నాడు'
'ఏం,ఉద్యోగం వచ్చిందా?'
'అబ్బే, కాళ్ళ నొప్పులు తగ్గాయి'
(ఆంధ్ర ప్రభలోనా? ఆంధ్ర జ్యోతి లోనా? గుర్తు లేదు కానీ అచ్చయింది)

Powered by Create your own unique website with customizable templates.
  • మునుపటి నా మాట
  • కనులు పాట పాడునని...
    • కనులు చూసినా పాటే... (Video)
    • కనులు మూసినా పాటే... (Audio)
    • కనులు చదివినా పాటే... (Readio)
  • అచ్చం అవే 'అచ్చు'లు
    • పాట = తిరుగు 'టపా'
    • తిరుగులేని మాట
    • తీరైన మాట
  • పొట్ట చెక్కలు
    • బాపురే రమణీయం >
      • బాపు గీత
      • రమణ రాత
    • గోప్యం....మాయ కానీయం >
      • అచ్చోసిన సొంత కితకితలు
      • అచ్చుకాని సొంత పక పకలు
  • బొమ్మ-లాంతరు
    • ఆల్ 'బొమ్మ'లే....
    • తెలిసినదే ... మళ్ళీ
  • Net Post
  • మునుపటి నా మాట
  • కనులు పాట పాడునని...
    • కనులు చూసినా పాటే... (Video)
    • కనులు మూసినా పాటే... (Audio)
    • కనులు చదివినా పాటే... (Readio)
  • అచ్చం అవే 'అచ్చు'లు
    • పాట = తిరుగు 'టపా'
    • తిరుగులేని మాట
    • తీరైన మాట
  • పొట్ట చెక్కలు
    • బాపురే రమణీయం >
      • బాపు గీత
      • రమణ రాత
    • గోప్యం....మాయ కానీయం >
      • అచ్చోసిన సొంత కితకితలు
      • అచ్చుకాని సొంత పక పకలు
  • బొమ్మ-లాంతరు
    • ఆల్ 'బొమ్మ'లే....
    • తెలిసినదే ... మళ్ళీ
  • Net Post