మునుపటి నా మాట
రెండువేల పదమూడు డిసెంబర్ ఇరవై ఒకటి....శనివారం... అయితే ఏమిటట? విశేషమా? సూర్యుడు దక్షిణం వైపు వెళుతూ వెళుతూ ఈ రోజు ఇరవై మూడు డిగ్రీల ఇరవై ఆరు మినిట్స్ దగ్గర చేరుకొని ఎవరెస్టు శిఖరం ఎక్కినంత సంబర పడి, ఇహ చాల్లే అని ఉత్తర దిశ వైపు తిరుగు ముఖం పట్టడమే ఇవాళ్టి విశేషం. దీన్నే మనం....ఏదీ జనవరి పదిహేనుకి వస్తుందే...మకర సంక్రాంతి అనేది ....దానితో పోల్చవచ్చు. ఉత్తరాన ఉన్న పాశ్చాత్య ప్రపంచం అంతా ఈ రోజు నుంచే శీతాకాలం ప్రారంభం అని ఘోషిస్తుంది. పైగా..మరో నాలుగు రోజుల్లో జీసస్ జననం కనుక కొత్త సంవత్సరం రావడం, కొత్త ఆశలు, కొత్త సంతోషం కలగడం ఈ రోజు నుంచే మరి. శీతవేళ రానీయకు రానీయకు..శిశిరానికి చోటీయకు చోటీయకు ...అని దేవులపల్లి కవి మనసు పదేపదే కోరుకుంది. ఆ మనీషికి ఆమని ఒక్కటే ఆదర్శం. ‘ఆరు ఋతువులు ఆమని వేళలే మన తోటలో’, ‘ప్రతి రాత్రి వసంత రాత్రి’ అని ఆయన కలం విన్నవించుకున్నది ఇందుకే.
0 Comments
‘పిల్లలూ ఇవాళ తారీకేమిటర్రా?’ ’డిసెంబర్ 11’ ‘సంవత్సరంతోపాటు చెప్పండర్రా..’ ‘11-12-13…ఆయ్ ..మాస్టారూ అంకెలన్నీ వరసగా వచ్చాయి’ ‘అందుకే ..తేదీ చెప్పమన్నానర్రా....ఇలా వరసగా మూడంకెలు ఎప్పుడొస్తాయో చెప్పగలరా?’ ‘మళ్ళీ వందేళ్ళాగాలి కదండీ మాస్టారూ...అంటే ... ఇలాంటి రోజు మళ్ళీ రానే రాదు* కదండీ. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు**.. కదండీ’ ‘అవునర్రా...ఇప్పుడు మీరన్నారే .....అవే పల్లవులుగా రెండు పాటలొచ్చాయి. ఒకటి నేను మీలా స్టూడెంట్ గా ఉన్నప్పుడు డబ్భైల కాలంలో విన్నది. ఒకటి మీతో పాటు విన్నది ...ఈ దశాబ్దం నాటిది. సరే...అడుగుతున్నా ...ఇలాంటి రోజు మళ్ళీ ఎందుకు రాదు చెప్పండీ?’ ‘సంవత్సరంలో ఉండేవి పన్నెండు నెలలే కదండీ మాస్టారూ ...డిసెంబర్ తరువాత పదమూడవ నెల లేదు కాబట్టి’ ‘గుడ్ గుడ్ ...ఇలాంటి వరస కిందిటి సంవత్సరం కూడా వచ్చింది. ఆ మాట కొస్తే ఏదో ఒక నెలతో ప్రతి సంవత్సరమూ వచ్చింది. ఏదీ చెప్పండీ?’ అంతే కదా.. మనం వేసే ఆ అద్భత నూలు పోగే ‘చంద్ర హారం’ ..... పుడమి మీద నెలబాలుడు పుష్కల మైన వెలుగులు నింపేందుకు డిసెంబర్ 4న దిగుతున్నాడు. రెండు రోజుల క్రితమే అమావాస్య చీకటి లాంటి గర్భ సంచిలో ఉండి బయట పడేదెప్పుడా అని ఆశతో ఎదురు చూశాడు. సముద్రుడు ‘వారసత్వం’ సరే... ‘వంశోద్ధారకుడు’ రాబోతున్నాడని సంతోషిస్తున్నాడు. ------- ‘పెద్దక్కయ్య’ ‘లక్షమ్మ’ రాబోతున్న ‘రక్త సంబంధం’ తలచుకుంటూ పొంగి పోతోంది. ‘నన్న తమ్మ’ అని కన్నడంలో మురిసి పోతోంది. ‘తల్లిదండ్రులు’ ‘చంద్ర వంక’ చూసి అమ్మాయ్ ..వీడికి మన ‘సొంత వూరు’ ‘పల్లెటూరు’ లో ‘చుట్టరికాలు’ వెతికి ‘మేనకోడలు’ ని ఎత్తుకొచ్చి ‘పెళ్లి చేసి చూడు’ అని తనకే పెద్ద బాధ్యత అప్పగించే ఆ ‘రేపు నాదే’ కదా అని గర్వ పడుతోంది. ‘మంచి మనసుకు మంచి రోజులు’ అంటే ఇదే కాబోలు అనుకుంది. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|