మునుపటి నా మాట
తెకతెకలు, లుకలుకలు, గునగునలు ... తెలుగు భాషవే! click to zoom ఏ భాషకి తగ్గ అందమైన పద సామగ్రి ఆ భాషకి ఉండడం వింతకాదు. తేనె కన్న తియ్యనిది తెలుగు కాబట్టి తెలుగు పదాల మాధుర్యాన్ని ‘తెలుగు’లోని మూడక్షారాల సాక్షిగా ‘తెలుగు తెకతెకలు’, ‘తెలుగు లుకలుకలు’, ‘తెలుగు గునగునలు’ అనే మూడు కొత్త అంశాలుగా సాహిత్య విస్తరిలో వడ్డించి చవి చూడడమే ఈ పూట ప్రత్యేకత. తెలుగు తెకతెకలు అంటే అవి తెలుగు జోకులు, ఉడుకునీళ్ళ శబ్దం లా కొందరు నవ్వుతుంటారు. అందుకనీ ‘తెకతెకలు’ అందాం. అదేమిటీ – నీళ్ళు ‘కుతకుత’ ఉడుకుతాయి కదా అని సందేహిస్తే దానికి సమాధానం: ఎవరైనా జోకులకి నవ్వలేక పోతున్నారంటే అందుక్కారణం వాళ్ళ మనసు ‘కుతకుత’ ఉడుకోతోందన్నమాట. తెకతెక అలా కాదు. సహజ సిద్ధంగా నవ్విస్తుంది. అది ఏకాకి నవ్వు.ఏకాంత నవ్వు. ‘తెకతెక’ గుంపులో చేరితే ‘పకపక’అవుతుంది. తెకతెక తెలుగు జోకులంటే అవి ఇతర భాషల్లో సాధ్యం కానివి అని గ్రహించాలి. అంతేకాదు- మూడు చెరువుల నీళ్ళు తాగించినా సరే మరో భాషలోకి తర్జుమా చేయలేనివి ఇవి. తెలుగు లుకలుకలు అంటే - ‘నా బుర్రలో ఏముంది, అంతా మట్టి’ అనే న్యూనతాభావం నుంచి మెదడుకి మేత అందగానే అదే మెదడుని చకచక పరిగెత్తించడం. తెలుగు మాటల పొందిక, మాట విరుపుల సొగసులు ఇందులో కనిపిస్తాయి.
7 Comments
అందరి అమ్మలూ ఆ పనే చేస్తారు, నాలుక పైన నాలుగు మాటలు నేర్పి. ‘పసిపాప పలికేటి మొదటి మాట – అదే అమ్మా అమ్మా అన్న ‘తెలుగు’ మాట ‘ అని కవి దాశరథి ‘అమ్మ’ తో పాటూ తెలుగుకీ విలువ పెంచారు. అమ్మ అన్నది ఒక కమ్మని మాట – మరో కవికి. అమ్మ –మాతృమూర్తి – అడ్డాల నాడు ఏ భాష నేర్పితే అదే ‘స్వర పేటిక’ లో నిక్షిప్తమై ఉండిపోతుంది. అందుకే ‘మాతృభాష’ అంటే అంత గౌరవం అందరికీ. అసలు ‘అమ్మ’ అనేది కేవలం తెలుగు భాష కాదు, తెలుగును కన్న సంస్కృత మాత ‘ ఓంకారం’ = అ-ఉ-మ-అనే మూడక్షరాల సంగమంతో మొత్తం భారత జనులందరికీ పంచి ఇచ్చిన తొలి భాష. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|