మునుపటి నా మాట
ఎందుకో ఈ మాట నూతన్ ప్రసాద్ నిన్న (30 మార్చి2011) ఉదయం మనందరి ముఖాల్లో ఆనందం కనిపించాలని అనే ఉంటారు. భగవంతుడు నూట రెండో జిల్లాకి నీ అవసరం ఉంది రమ్మని అంతలోనే కబురు పెట్టాడు నూటొక్క జిల్లాల అందగాడిని. లేకపోతె-ఒక్క రోజులోనే రెండు ఉదంతాలా? ఎప్పటిలా కొత్తదనం నాలో ఏముందని అంటూనే ఉదయం సూర్యుడు 'నీ పేరులో నిత్య నూతనత్వం వరంగా పొందావు కదూ ప్రసాదూ నాలో కలిసిపోవోయి' అనడం ఏమిటీ, కైకలూరు వర ప్రసాదం మన నూతన్ ప్రసాద్ సరే అనడం ఏమిటీ ! మనవి విషాద వదనాలు చేయడం ఏమిటీ?
0 Comments
ఈ మార్చి నెలలో ఛత్రపతి శివాజీ మహారాజు గురించి ప్రపంచం పై కప్పు ఎక్కి చెప్పవచ్చుఅనిపించింది. ఈ మార్చిలోనే చ'క్రికెట్టు'ల తెలిసేనో ప్రపంచ కప్పు 'క్రికెట్టు' యువరాజు గురించి. ఇదే మార్చిలో (28 న) నూటా ఏడు సంవత్సరాల క్రితం గుంటూరులో జన్మించిన నట యువరాజు, తొలి సినీ కోటలో మకుటం లేని మహారాజు గురించి ఇప్పుడు కొత్తగా చెప్పడమంటే ప్రపంచమంతా నవ్వుకోదూ? నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు? అన్నారు గురువులు దేవులపల్లి. ఆ ధైర్యంతోనే ఈ పూట నా మాటగా 'ఎందరో మహానుభావుల పావన గుణ రూపం' గురించి చెబుతా. నాగయ్య లేదా చిత్తూరు వి నాగయ్య అంటే తెలుగు సినిమా పసితనంలో (అంటే 1940 ఆ ప్రాంతాలు) ఉండగా అయినా 'హీరో'చిత నటుడు. నాగయ్య అంటే హెచ్.ఏం.రెడ్డి, కే.వి.రెడ్డి, బి.ఎన్.రెడ్డి ల త్రివేణీ సంగమం. నాగయ్య అంటే 'వీళ్ళంతా ఇలాగే ఉండే వారేమో' అని అనిపించే పోతన, వేమన, త్యాగయ్య, రామదాసులు ఒక్కొక్కరు. అప్పటికింకా తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు అంతగా బయట పడలేదు. లేదంటే తప్పకుండా నాగయ్యే అన్నమయ్య అయ్యే వారు. పోతనగా గుమ్మడి గారు నటించినా నాగయ్య గారితో పోలిస్తే తను శూన్యం అనుకున్న రోజులూ ఉండేవి. ఫాల్గుణ బహుళ తదియ (తృతీయ) తిథి - మన దేశ చరిత్ర సంపదలో ఒక పెన్నిధి. ఎందుకంటే ఈ తిథిని ఒక మరాఠా తేజం పుట్టింది. అది భోంస్లే రాజ వంశానికే కాదు యావత్ ప్రజానీకానికీ గర్వ కారణం. షాహాజీ, జిజాబాయిల కడపటి (అయిదవ) సంతానమది. భవానీ మాత వర ప్రసాదమది. అందుకే పేరులో శివ శబ్దముంది. శివనేరి కోటలో అప్పుడు ఉదయించిన ఆ పసివాడి తేజస్సు మరిన్ని వెలుగులు వెదజల్లుతుందని ఎవరూహించ గలిగారో గానీ వారు ధన్యులే. తండ్రిలో అమిత శక్తి ఉంది. తల్లిలో అలౌకిక భక్తి ఉంది. రెండూ కలిసి ఆ పసివాడిని ఒక విశిష్ట వ్యక్తిగా తీర్చి దిద్దాయి. శివాజీ అంటేనే ఒక సంస్కృతి, ఒక దుర్గం, ఒక భరోసా- అని ముద్ర వేసుకున్నాయి. చిన్నతనం నుంచే గోమాజీ దక్షతలో పెరిగి సద్గుణ సంపన్నుడయ్యాడు. స్వామి సమర్థ రామదాసు వారి సన్మార్గ బోధలు విని ఆచరించిన వాడు,గురువులు దాదాజీ కొండ్ దేవ్ దగ్గర సైనిక శిక్షణలో మెళకువలు నేర్చిన వాడు, జ్ఞానేశ్వర్, తుకారాం వంటి వాగ్గేయకారుల (సంత్) నుండి సాధారణ 'జీవన శైలి' అనుసరించిన వాడు కనుకనే శివాజీ అసామాన్యుడయ్యాడు. ఈ ఫాల్గుణ పౌర్ణమి నాడు ( 19 మార్చి 2011 ) చంద్రుడు ఎప్పటిలాగే గుండ్రంగానే కన్పించినా కాస్త ఒళ్ళు చేసినట్టు ఉంటాడు. ఎప్పుడైతే చంద్రుడు కొంచెం తక్కువ దూరంలో భూమి, సూర్యుడు ఉన్న సరళ రేఖలో తిన్నగా వచ్చి ఉంటాడో అప్పుడే ఇలా లావుగా కనిపిస్తాడు. ఇది సుమారు 19 ఏళ్ల కొకసారి జరుగుతూ ఉంటుంది. ప్రతి పున్నమికి ఈ ముగ్గురూ ఒకే రేఖలోనే ఉన్నా ‘ఎంతెంత దూరం’ అన్న దాని బట్టే ఉంటుంది. ప్రతి నెలా చంద్రుడు భూమికి దగ్గర్లో ఉండే స్థానాన్ని ‘పెరిగీ’ (పెరిజీ) అని , దూరంగా ఉండే స్థానాన్ని ‘అపోగీ’ (అపోజీ) అని అంటారు. అరిచి ‘గీ’ పెట్టినా హం ఏ సబ్ జాన్తా నై ‘జీ’ అని విసుక్కోకండి. ఉండండుండండి ... సులభ మార్గం చెబుతా. ‘అపార దూరంలో ఉంటే అది అపోగీ, పరిమిత దూరంలో ఉంటే అది పెరిగీ’. అదే భూమి సూర్యుడికి దగ్గర్లో ఉంటే ‘పెర్హీలియన్’, దూరంగా ఉంటే ‘ఎపి హీలియన్’ అంటారు. ఇది శుక్ల పక్షం కాబట్టి చంద్రుడు ‘పెరిగే కాంతుల’ వాడు కదా . అలాంటప్పుడు ఎక్కడమ్మా చందురుడు? అని అదే(వి ప్రశ్న? అవును- గమనిస్తే చంద్రుడు లాంటి ‘చందూర్’ గారు హడావుడిగా నింగి వైపు పయనమైపోయారు కనుక ‘ఇంకెక్కడ చందురుడు మనకి?’ అని జాలి పడతాం. చంద్రుడు భూమి చుట్టూ తిరిగితే ‘చందూర్’ ‘జగతి’ చుట్టూ తిరిగేరు. ‘జగతి’ ఆయన నడిపిన పత్రిక పేరు. ఎవ్వరైనా సరే ‘చందూర్’ అంటే మేడమ్ మాలతీ చందూర్ గానే ఎరుగుదురు. ఆమె ఆంధ్ర ప్రభ లో ఎన్నేళ్ళు ‘జవాబులు’ శీర్షికన ఎన్నెన్ని విషయాలు చెప్పే వారు! వీటి వెనక ‘మగ చందూర్’ గారి బ్రెయిన్ ఉందిస్మీ అనేవారు ఆ రోజుల్లో ‘చందూర్’ గారి శైలి తెలిసిన వారు. అలా అయితే ఆమె ‘వంటలు’ ఆంధ్ర, ఆంధ్రేతర ప్రాంతాల్లో ఇంటింటా కర దీపికలే- అవీ ఆయన ‘చేతి’ చలవే అంటే కష్టమే. ఈ హెడ్డింగు అనే సూట్ కేస్ వెనక ఒక పాత సినిమా టైటిల్ అనే బెడ్డింగు ఉన్నట్టు కనిపెట్టారు కదూ- భేష్ ! మీరు నిజమే. పాత ప్రయాణాల్లో ఇవి సహజమే. నాలుగున్నర దశాబ్దాల క్రితం (అంటే 1965 లో) ప్రసాద్ ఆర్ట్స్ వారు ‘మనుషులు మమతలు’ అనే చిత్రం తీస్తే చిత్రంగా దానికి ‘A’ సర్టిఫికేట్ ఇచ్చింది అప్పటి సెన్సారు. ఈ అక్షరాలతో మనకేమిటి గానీ , వీరబ్రహ్మం గారు కూడా కనిపెట్టలేని వీర లెవెల్ కాల గ్యా(నం ఈ సినిమా ద్వారా ప్రాప్తమైంది. జాగర్తగా గమనిస్తే తీసిన వారి పేరు, సినిమా పేరు లో మాజీ రైల్వే మంత్రి గారి పేరు, ప్రస్తుత రైల్వే మంత్రి గారి పేరు కనిపిస్తున్నాయి కదూ. ఈ సినిమాలోనే కుమారి జయలలిత హీరోయిన్ గా పరిచయం కావడం విశేషం. ఆమె హీరో ని అవుట్ చెయ్యక పోయినా , అవుట్ సైడ్ లో హీరో గానే వెలిగారు. తమిళనాడు ముఖ్యమంత్రి కాగలిగారు కదా. అలా – ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోతుంది. శ్రీ పంచమి నాటికి స్వీకారం చుట్టి శివ రాత్రి వరకు ఎన్నో ముఖ్యమైన పండుగలు పూర్తి చేసుకుంటుంది మాఘ మాసం. మాఘ స్నానాలు పవిత్రమైనవి- అని చెప్పి పోతుంది, అదీ మన మంచి కోసం. శివుడికీ నీటికీ అనుబంధముంది. ఈశాన్య దిక్కుకి పెద్ద దిక్కు శివుడే. గృహ వాస్తు లో ఈ దిక్కులోనే నీటిని పొందమంటారు. గంగను తల మీద మోయడం తలకు మించిన భారమనుకోక భగీరథ ప్రయత్నానికి సాయపడిన వాడు ఈ సాంబ శివుడు. దేవులపల్లి వారు ఏమన్నారూ?- ‘శ్రీ శైలం మల్లన్న శిరసొంచేనా చేనంతా గంగమ్మ వాన’ అనేగా. వర్షాభావం ఏర్పడినప్పుడు తల్లడిల్లిపోక, డిల్లీకి పోక కర్షక హృదయం శివుడినే నమ్ముకోవాలి. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|