మునుపటి నా మాట
లో:‘విశ్వం గారూ...విశ్వం గారూ... నేనేనండీ...నన్ను చూసి కెవ్వు మని అరుస్తారేమో అని భయ పడుతూనే ఉన్నా. అలా నోరెళ్ళబెట్టకండీ. ఆషాఢ మాసం...ఈగల కాలం. హమ్మా..పాడు దోమ..పగలు కుడుతోంది... ఈమధ్య ఇదో భయం. దోమల టైం టేబిలు కూడా తెలుసుకోవాలి...ఏది కుడితే ఏమొస్తుందో తెలియదు. అహ(.. మీ ఇంట్లోనే ఉన్నాయని దెప్పుతున్నానని అనుకోకండి..భలేవారే.. ఏ ఇంట చూసినా ఇదే తంతు. అవునండీ.. వార్కరీలు, జ్ఞానేశ్వర్ పాదుకలు, తుకారం పాదుకలు, పండరీపుర యాత్ర... ఆహాహా... ఎంత క్రమ శిక్షణ .... ఎంత నిబద్ధత... ఎంత గొప్ప ఆపన్న హస్తాల ఉచిత సేవ .....మహారాష్ట్రలోఆషాఢ ప్రారంభంలో పుణే పరిసరాల్లో కనువిందు కదండీ ఈ విష్ణు దర్శన దృశ్యం! అలాగే ఇదే ఆషాడ మాసం రెండో తిథిని ఒడిశాలో పూరీ క్షేత్రంలో జరిగే శ్రీ జగన్నాథ రథయాత్ర ..అంతే కనువిందు కదండీ. విప్లవ కవి అయినా శ్రీశ్రీ గారిలోనూ కొన్ని సంప్రదాయ పోకడలు లేక పోలేదు... వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాల్ ...రథ చక్రాల్ అంటూ ఓహోహో...ఆ రోజుల్లో ఆయన వినిపించిన ఆ సుదీర్ఘ గేయం అందరికీ కంఠోపాఠం కదండీ. ..
0 Comments
ఆషాఢ ఏకాదశి నాడు పాండురంగ సన్నిధి పరమ పుణ్య పెన్నిధి. ఆ తిథికి ఒక రోజు ముందు జగన్నాథుడు పూరీలో తన రథయాత్ర ముగించుకుంటాడు. సరిగ్గా ఇలాగే తమిళనాట చిత్ర లోకం చుట్టిన కవి ‘వాలి’బన్ ఆషాఢ ద్వాదశి నాడు (జూలై 18,2013) తన సుదీర్ఘ రాత యాత్ర ముగించుకున్నాడు. అవును.... ఎనభై రెండేళ్ళ కవి ‘వాలి’ రెప్పలు అలసి సొలసి వాలి అపుడే ఇది మూడవ రోజు అయిపొయింది. వాలి చుట్టూ తిరిగిన చిత్ర లోకం ఇక పైన ఎవరిని పిలవాలి? నాటి మహోన్నతుడు ఎమ్జీ ఆర్ నుంచి నేటి డాషింగ్ ధనుష్ వరకు అందరి పెదవుల మీద కదిలిన పాటల్లో ఎక్కువ వాటా ఉన్నది వాలికే. ‘ఉలగం సుట్రుం వాలిబన్’ (1973) చిత్రంలో పాటలు వ్రాసిన నాటికి ఆయన చిత్రసీమ వయసు రెండు దశాబ్దాలే. మళ్ళీ మకుటం మారి ‘వాలిబన్ సుట్రుం ఉలగం’(2010) కనిపిస్తే అక్కడా వాలి వాక్కు వినిపించింది. నాటి నట భూషణ జెమిని గనేషణ్ మనవడు గణిత మేధావి ‘రామానుజన్’ గా నటిస్తున్న చిత్రమే వాలి చివరి చిత్రం. వాలి అసలు పేరు ‘రంగస్వామి’ అని అంటే ఆశ్చర్యంగా ఉండదూ? వట్టి రంగస్వామియే కాదు- టి.ఎస్. అనే రెండక్షరాలు ముందుంటాయి. టి – అంటే తిరుచ్చి, ఎస్- అంటే శ్రీరంగం కాబోలు. ఎందుకంటే ఆయన జన్మస్థలం- తిరుచిరాపల్లి సమీపంలో ఉన్న శ్రీరంగమే. లాభం లేదండీ... ఈ ఏడాది మనల్ని ఇబ్బంది పెడుతోంది. దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. ఇపుడిపుడే గాయం మాయం అవుతోందనుకుంటే మరో గాయం సాయం రావడం ఏమిటీ? అదైనా మూడు రూపాల్లో రావడం ఖాయం అని మనమేమైనా కల గన్నామా? కల కనేందుకు కన్ను ఎప్పటిలా నిద్ర పోతూనే ఉంటుంది. నిద్రాభంగం కాగానే తెలుస్తుంది ఏదో ఉపద్రవం పొంచి ఉందనీ. ‘కన్ను తెరిస్తే జననం- కన్ను మూస్తే మరణం – రెప్పపాటే కాదా ఈ ప్రయాణం’ అని చంద్రసేన్ గారు రాసిన మినీ కవిత (భారతి, సెప్టెంబరు 1980) కి శీర్షిక – కంటి తెలివి. ఇది ఎంత వాస్తవమో – ఆది శంకరులన్నట్టు ‘పునరపి జననం పునరపి మరణం’ కూడా అంతే వాస్తవం. అసలు కంటి తెలివి అనే కన్నా ‘ముక్కంటి తెలివి’ అనడం సబబు. జననంకి బ్రహ్మ, మరణంకి శివుడు, ప్రయాణం కి విష్ణువు – ఈ మూడు నేత్రాల తెలివే ఇదంతా. అదేమిటో...ఈ భూమ్మీద రోజుకొక్కరైనా పుడుతుంటారు, రోజుకొక్కరైనా పోతూ ఉంటారు. తెలుగువారి ‘బాల’ ఇష్టాలు: తెలుగువారి సినీ సంగీత ప్రపంచ ప్రముఖత్వమంతా ‘బాల’ మయమే, ఔనా కాదా అంటే ఆబాలగోపాలం ఔననే అంటారు. ఘంటసాల మాస్టారు గారిని చిన్నతనంలో ‘బాల భరతుడు’ అనేవారు, ఎందుకంటే ఆయన చిన్న చిన్న పాత్రలు పోషించి పాడుతూ ఉండేవారు కనుక. ఆ తరువాత ఆయన తెలుగు సినిమా చరిత్రలో ఒక గాయకుడిగానూ, సంగీత దర్శకుడిగానూ తనదంటూ ఒక విశేష ముద్ర సృష్టించి ‘ఘంటసాల యుగం’ అనేది ఒకటి ఉండేదనటానికి నిదర్శనంగా ముప్ఫైఏళ్ల కాలం మనముందుంచారు. అక్కినేని ఆఖరు సారిగా తన పాత్రకి తానే పాడడం, ఆ పాట రికార్డ్ రూపంలో రావడం, చిత్రంలో ఘంటసాల వారి గళం వినిపించడం – అంటే అక్కినేని వారికి తొలిసారిగా ఘంటసాల వారు ప్లే బ్యాక్ పాడడం ఇవన్నీ చరిత్రకెక్కిన గొప్ప విషయాలైతే ఆ చిత్రం పేరు ‘బాలరాజు’! ఆకాశవాణికి కేరాఫ్ అడ్రస్ ఎవరంటే చప్పున గుర్తొచ్చే పేరు- బాలాంత్రపు రజనీకాంతరావు గారు. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|