మునుపటి నా మాట
లలిత సంగీతం, సినిమా సంగీతం – ఏక రూపం నుంచి వచ్చిన రెండు అపురూప ఉప రూపాలు. ఏక రూపమైన సంగీతంలోనూ అంతే ... స్వరం, రాగం రెండు స్వరూపాలు. స్వరములు ఏడైనా రాగాలెన్నో – అని కవి అబ్బురపడితే పడు గాక - ఒకాయనకి మాత్రం ఏడు రాగాలు చాలు. యమన్, మాల్కోస్, భీమ్ పలాస్, మోహన, కమాజ్, జయజయవంతి, హరికాంభోజి అలాగని ఆ ఒకాయనకి తతిమ్మా రాగాలతో ప్రమేయం లేదని కాదు- ‘బహుదారి’ వంటి అరుదైన రాగానికి దారి చూపించింది ఆ ఒకాయనే. కాబట్టే ఆ దారిలో ‘నిలువుమా నిలువుమా నీలవేణీ’ (అమరశిల్పి జక్కన్న), అనగానే ఆగాయి పాదాలు. ‘నడు.. నడు...నడచిరా హంస వలె’ (చిలకా గోరింకా) అనగానే కదిలాయి పాదాలు. ‘బేహాగ్’ రాగాన్ని ఆప్యాయంగా ‘హగ్’ చేసుకున్నదీ ఆ ఒకాయనే. కాబట్టే ‘వర మొసగే వనమాలీ నా వాంఛితమ్ము నెరవేరునుగా’ (భక్త ప్రహ్లాద) అని నారదుడు విష్ణు భక్త ఆలింగనంలో కరిగిపోయాడు.
1 Comment
'అందాల రాశి ఐశ్వర్య రాయి బచ్చన్ ఎక్కడ కనిపించినా ఎవరో ఒకరు ఈల వేస్తూనే ఉంటారట. కాని వాళ్ళాయన ఉన్నాడే...అభిషేక్ ...అస్సలు ఈల వెయ్యడట’ ‘ఏమో...వాళ్ళిద్దరూ హాయిగా ఈల వేసి పిలవకోయి అని మన తెలుగు పాట పాడుకుంటారు కాబోలు. ఎవడికి తెలుసూ?’ ‘అయ్యో..జోకుల్తో అడ్డు పడకమ్మా.. తెలుగు పాడరు...ఆమె కన్నడం అందుకుంటుంది’ ‘కన్నడం అనగానే మరొక అందాల భరిణె శిల్పా శెట్టి గుర్తొస్తోంది’ ‘మహా ప్రభో ..నాకు తెలుసు ఎందరో ఎప్పటినుంచో చెవిలో ఇల్లు కట్టుకుని యోగాసనాలు వెయ్యండర్రా మంచిది మీ ఒంటికి అని అంటుంటే వినలేదు కాని ఈమె వీడియో రిలీజ్ చెయ్యగానే ఎక్కడ లేని హుషారు తన్నుకొచ్చి అంతా తెగ ఆసనాలు వేసేస్తున్నారు. బేడప్పా బేడ ..దయ విట్టు స్వల్ప నన్న మేలె దయ తోర్సీ ( వద్దు బాబూ వద్దు. దయ చేసి కొంచెం నా మీద దయ చూపండి)’ ‘ఓహో...వీడియో కావాలా? బెంగళూరు ఎమ్జీ రోడ్ లో అప్పుడెప్పుడో కొన్న ఆ ముప్ఫయి రోజుల్లో కన్నడం పుస్తక మహిమా ఇది. మా తండ్రే. అయినా ఈ పాత అందాలు బోరు బోరు. కొత్త అందాలుండగా.........’ ‘కొత్త ఒక వింత నాయనా ......మిస్ వరల్డ్ 2013 ... మెగాన్ యంగ్ అట. ప్రపంచం మొత్తం లో నూటా ముప్ఫై మంది లోంచి ఎన్నిక కావడం తమాషా కాదు’ |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|