మునుపటి నా మాట
Dear ‘SIR’, Today , the 28th February, we are celebrating the ‘National Science Day’ in our country and we are proud that this is the twenty fifth NSD. Many know that this day has something to do with your name but still mistake it as your birth day. This was the day in 1928you had discovered an interesting optical phenomenon which was called ‘Raman Effect’, for which you received NOBEL PRIZE for PHYSICS in 1930. It was in 1986 that the then Rajiv Gandhi Government declared Feb 28 to be observed as NSD. Thus the first NSD was commenced in 1987.
0 Comments
ముళ్ళ మీద కూర్చున్నట్టనిపించింది మొన్న ముళ్ళపూడి వారు చనిపోయారన్న వార్త టీవీ లో వినగానే. అప్రయత్నంగా లేచి ‘అరరే!’ అనుకున్నాను, ఒక ఆత్మీయుడు ఇక లేరు అనేది వాస్తవమని తెలిసి. ఆంధ్రులందరికీ ఆత్మీయుడాయన. బాపు గారికైతే మరీ ప్రత్యేగాత్ముడు కూడాను. మన వెంకట రమణ గారు సరిగ్గా ఎనిమిది పదుల కాలం ‘ఎనిమిటి’ అనేది లేక బతికిన స్నేహ మూర్తి. తలుచుకుంటే చాలు గుండె చెమ్మగిల్లుతుంది- ఆయన అంతిమ ఘడియల్లో బాపు వైపు చూస్తూ చేతులు జోడించి నమస్కరించారుట. ఆయన -పాట అనే మాటకి నిర్వచనం. ఆయన పాట రాసి ఇవ్వడం అంటే మరో కొత్త కుసుమం విరిసినట్టే. అదే పాట స్వరాల చందనం పూసుకుందంటే ఇక ఆ తోటనిండా పరిమళాల గుబాళింపే. ఆకాశవాణి ఆయన పాటని ఆనాడు ఆకాశ వీధుల గుండా తిరగనిచ్చి ప్రతి ఇంట మళ్ళీ మళ్ళీ వినిపించే అవకాశం కలిగించింది. ఆయన రాసిన శ్రవ్య నాటికలు ఒక పక్క ముచ్చటైన కోమలమైన మాటలతో, మధ్య మధ్య పాటలతో కనిపించని దృశ్యాన్ని కళ్ళకు కట్టి చూపించేవి. అందరి అమ్మలూ ఆ పనే చేస్తారు, నాలుక పైన నాలుగు మాటలు నేర్పి. ‘పసిపాప పలికేటి మొదటి మాట – అదే అమ్మా అమ్మా అన్న ‘తెలుగు’ మాట ‘ అని కవి దాశరథి ‘అమ్మ’ తో పాటూ తెలుగుకీ విలువ పెంచారు. అమ్మ అన్నది ఒక కమ్మని మాట – మరో కవికి. అమ్మ –మాతృమూర్తి – అడ్డాల నాడు ఏ భాష నేర్పితే అదే ‘స్వర పేటిక’ లో నిక్షిప్తమై ఉండిపోతుంది. అందుకే ‘మాతృభాష’ అంటే అంత గౌరవం అందరికీ. అసలు ‘అమ్మ’ అనేది కేవలం తెలుగు భాష కాదు, తెలుగును కన్న సంస్కృత మాత ‘ ఓంకారం’ = అ-ఉ-మ-అనే మూడక్షరాల సంగమంతో మొత్తం భారత జనులందరికీ పంచి ఇచ్చిన తొలి భాష. మహారాష్ట్రకే కాదు యావత్ భారతానికే మణి కిరీటమైన మహారాజు ఛత్రపతి శివాజీ! ఆ మహా ధార్మికుడు, రాజస మూర్తి జననం గ్రెగేరియన్ కేలండర్ ప్రకారం ఈ ఫిబ్రవరి 19 న. తిథుల ప్రకారం ఈ ఏడాది మార్చి 22 న. ఆనాడు ఆయనకు జోహార్లు చెప్పుకుందాం. అరె, ఇదే ఫిబ్రవరి 19న మన కళా తపస్వి ‘కె. విశ్వనాధ్’ పుట్టిన రోజు కూడా. శనివారం ఉదయం'జీ తెలుగు టీ వీ' వాళ్ళు సందర్భోచితంగా మహారాష్ట్ర మందిర దర్శనం చేయిస్తున్నారు. ఆహా, పూణే లోని పాషాణ్ ( అంటే కొండ ) ప్రాంతంలో ఉన్న అహోబిల మఠం వారి శ్రీ బాలాజీ మందిరాన్ని చూపిస్తున్నారు. కొండ దేవర ఎటొచ్చీ ఇక్కడ కొండ కింద ఉండాల్సి వచ్చింది. కలి యుగంలో దేవుడైనా కనికరించే స్థలంలోనే సర్దుకు పోవాలి మరి. గొప్ప విషయం ఏ(విటంటే ఇదే మందిరంలోమా జానకమ్మ, వాణీ జయరాం, పారుపల్లి రంగనాథ్, శోభారాజ్ తొమ్మిది అడుగుల ఆ దివ్య మంగళ మూర్తి ముందు గానాలాపన చేసి తరించారు. ‘మా చెవుల రింగు మనగ’ అని నాడు కవి ఏ సందర్భంలో అన్నారో గాని ఇప్పుడీ ఊళ్ళో సెల్లు రింగు టోన్ గా పారుపల్లి వారి ‘గోవింద’ స్మరణ సదా వినిపిస్తుంది. అంత్య ప్రాసలంటూ ఆరుద్ర ను తలచుకున్నప్పుడు ఎదురయ్యే మహా గొప్ప సమస్య ఇదే. శీర్షిక అలా కుదిరి పోయింది. గిన్నె అనడం బహుశ: రాబోయే ‘వరల్డ్ కప్’కు సూచన ఏమో? నిజంగానే మాఘ మాసం వెన్నెల చంద్రుడు బావుంటాడు. మాఘ మాసం పెళ్ళిళ్ళ సీజన్లో ‘నెర వెన్నెల కురిపించుతూ నెల రాజు పెండ్లిని చేసె’ అని బందిపోటు చేత కూడా అనిపించ గల సమర్ధుడు ఆరుద్ర. నాకు తెలిసి ‘మాఘ మాసం వెన్నెల’ అని ప్రయోగిస్తూ ఒక్క తెలుగు పాటా లేదు. అలాగే ఈ వెన్నెల్లో.. ఈ ముచ్చట్లు ఇది వరకెక్కడా విననివి , ఆస్వాదించండి. తెలుగు సినీ సంగీతం లో ‘ సా పా సా’ లు..... ఆది ‘వాస్తు’ విజ్ఞాని, దేవశిల్పి ‘విశ్వకర్మ’. హస్త కళ ఆయన ప్రత్యేకత. మంచి ‘constructive thinker’ అన్న మాట. ఆదర్శ వంతమైన ఆలోచనలే తప్ప ‘ఆదర్శ్’ అపార్ట్ మెంట్స్ లా కట్టేయడం, పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినందుకు కూల్చేయడానికి సిద్ధ పడడం లాంటివి ఎరుగని లోకం వారిది. అదేం లోకం? అదీ మన భూలోకమే కదా. అంటే పరిమితిలో, కనుగొన్న‘జ్యామితి’లోనే అన్ని కోణాలూ ఆలోచించి విశ్వకర్మ తన ఇంజనీరింగు ప్రతిభ చూపించేడన్న మాట. వారికి ‘కుంభ కోణాలు’ తెలియవాయే! భాగం - 1
మాఘ శుక్ల (శుద్ధ) ఏకాదశి – భీష్మ ఏకాదశి – భారత సాంప్రదాయం ప్రకారం, తిథుల విధుల ప్రకారం. అది ఈ రోజే. ఫిబ్రవరి 14 ‘ప్రేమికుల రోజు’ – విశ్వ నిర్ణేతలు నిర్ణయించగా విధిగా కాలేజీ కుర్ర కారు ఆచరిస్తున్న రోజు. భీష్ముడంటే పితా మహుడిగా, అంటే మంచి తాతయ్యగా ఈ నాటి కుర్రకారుకి తెలుసునో లేదో. భీష్ముడి తండ్రి శంతనుడు. శంతనుడికి కొన్ని విద్యలు తెలుసు. ముసలితనాన్ని పోగొట్టి యవ్వనాన్ని తిరిగి ఇవ్వగలడు. భీష్ముడి తల్లి గంగా దేవి. శంతనుడి ఒకానొక ప్రతిజ్ఞ్యా భంగం వల్ల ఆమె అతన్ని విడిచి, బిడ్డను తనతో తీసుకు పోయింది. అన్ని విద్యలూ నేర్పి, యవ్వనుడు కాగానే తిరిగి బిడ్డను తండ్రికి అప్పగించింది. బొమ్మలు గీసి, ఆ బొమ్మలకి కిసుక్కున నవ్వు తెప్పెంచే వ్యాఖ్య రాసి తెలుగు వాళ్ళ ఆరోగ్య పధకానికి ఎప్పుడో నాంది పలికిన ద్విజులు సత్తిరాజు లక్ష్మినారాయణ, ముళ్ళపూడి వెంకట రమణ. ఆ ముందాయన పేరుందే అది పెద్దగా ఉందా ? సరే. ఎవరక్కడ? చిత్తం. 'బాపు' అనే పేరును వెంటనే ఇక్కడ ప్రవేశ పెట్టండి. చిత్తం, మరి ఇంకో బాపు - మనకి స్వతంత్రం తెచ్చిపెట్టిన బాపు ఉన్నారే.... 'తెలుసులేవోయి. ఈయనా గొప్పే. ఎటొచ్చీ బొమ్మలు గీయడంలో మా గొప్ప స్వతంత్రం తీసుకు వచ్చ్చాడు'. 'అలా చెప్పండి. మరి ఆ రెండో ఆయన పేరు చాలా పొడుగు...' 'అతను తెలుగు వాళ్లకి బుడుగు' 'ఆ గదిలో ఎవరో లాఫింగ్ క్లబ్బు ట--తెగ రెచ్చి పోతున్నారు' 'ఎవరికైనా ఎన్నడైనా తెలియ రానిది కాలము' - ఘంటసాల పాట పల్లవి - నిజమే. ఈ కాల చక్రంలో ఎవరికైనా అంతే. విధి ఖాతాలో 'జ-మ' ఈ జీవితం. మొదటి పేజీ జ-జననం, చివరి పేజీ మ-మరణం. కానీ కొందరి జీవితాలకి వడ్డీ రూపంలో 'అభిమానం' అనేది ఉండి పోతుంది. కొన్ని తరాల వరకు అది అందుతూనే ఉంటుంది. అటువంటి కొందరినే 'మహానుభావులు' అంటాం. తెలుగు సినీమా అనే దృశ్య , శ్రావ్య మాధ్యమానికి డబ్భైఅయిదేళ్ళ పై చిలుకు వయసు ఉంటే అందులో మూడు పదుల కాలం తన గాన మాధుర్యంతో ఒక 'వరవడి' తీసుకొచ్చిన ఘంటసాల వెంకటేశ్వర రావు ఆ కొందరు మహానుభావుల జాబితాలో నిలిచిన గత శతాబ్దపు ఘన గళ గాయక త్రిమూర్తి. ఎందుకనీ? |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|