మునుపటి నా మాట
ఏదీ? 'అలుక' మీద ఏదీ రాయ లేదేం? అని అలిగే వారికి--- కాస్త ఆగండి. ముందు కనులు చూసినా పాటే, కనులు మూసినా పాటే లు చూడండి, వినండి. కొన్ని హాస్య గీతాలు చిత్రారే Re-చిత్రం లో ఉంటాయి. అవి కూడా అలుక పాన్పు పైన ఉన్నవే. చూడండి , వినండి. కనులు చదివినా పాటే- లో మరిన్ని రాబోతున్నాయి. ----------------------------------------- మొత్తానికి ఆ నాలుగు రోజుల విరామం లో పదకొండు వీడియోలు, ఏడు ఆడియోలుగా సాగిపోయిందన్న మాట మీ జీవిత గానం. వెరసి పద్ధెనిమిది 'అలుకల' తోరణం దీపావళిపండగ కారణం గా మీ ఇళ్లను అలరించిందన్న మాట. దీపావళికి ఓ నాలుగు రోజుల ముందే రాసి పెట్టిన మాటలెందుకు లెండి కానీ - ఇప్పుడేలాగూ దీపావళి రానే వచ్చేసింది కనుక విషయం లోకి వద్దాం. ఇంతకీ అలుకకీసత్యభామకీ ఏమిటి అనుబంధం? సత్యభామకీ దీపావళికీ ఉంది కానీ - అవునా? కృష్ణుడు తన సొంత మామే రాక్షసుడిలా ప్రవర్తిస్తుంటే ఊరుకోలేదు- తుదముట్టించేడు. అందుకే 'కంసారి' అనిపించుకున్నాడు. బకాసురుడినీ, కీచకుణ్ణీ భీముడి చేత అంతమొందించాడు. అందుకే పాండవులకి గొప్ప అండ అయ్యాడు. ప్రాగ్జ్యోతిష పురం లోని నరక బాధ పడలేక మునులు వేడితే బాణాలతోనూ, సుదర్శన చక్రం తోనూ, సరదా పడిన సత్యభామ తోనూ తరలి వెళ్లాడు. దారిలో మురాసురుడు ముప్పు తెస్తుంటే వాడిని మదించాడు. అందుకే 'మురారి' అయ్యాడు. ప్రజలు నరక యాతన ఎంతగా అనుభవిస్తున్నదీ వాడి చురుకు యుద్ధ ప్రతిభను చూస్తూ తెలుసు కున్నాడు. బాణాలు వేసి కృష్ణుడి ప్రాణాలు తీద్దామనుకున్న నరకుడు ఓ క్షణం కృష్ణుణ్ణి మూర్ఛపోయేలా చేశాడు. అప్పుడు వచ్చింది భామకి కోపం. అంతే శర వేగంతో నరకుడితో ఎదురు పోరాడింది. కృష్ణుడు మేల్కొన్నాడు. సుదర్శనం ప్రయోగించాడు. నరకుడు నరక లోకానికి వెళ్లి పోయాడు. ప్రాగ్జ్యోతిషం అంటేనే తూరుపు వెలుగులు. తొలి సూర్యుడి కిరణాల వెలుగులతో భారత జగతి మేల్కొనేది అక్కడి నుంచే. ఇదంతా పగటి వెలుగు. మరి రాత్రో? అందుకే ఇంటింటా దీపాలు వెలిగాయి. మొత్తం దేశమంతా వెలుగులు ప్రసరించాయి. దీపాల వరసే 'దీపావళి'.
0 Comments
|
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|