మునుపటి నా మాట
‘ఇవాళ ఏ తారీఖర్రా పిల్లలూ?’ ‘సెప్టెంబర్ ఇరవై అండీ మాస్టారూ ..’ ‘ఈ రోజు ప్రత్యేకత ఏమిటర్రా?’ ‘నే చెప్తా సార్’ ‘సార్ ..నే చెప్తా’ ‘నన్ను చెప్పనీండి సార్’ ‘నాకు తెల్సు సార్..నేనే చెప్తా’ ‘వదిలితే...మొత్తం అందరూ..ఏకకంఠంతో చెప్పేట్టున్నారే...ఉండండి..నువ్వు చెప్పరా నీలకంఠం..’ ‘నాగీస్సర్రావు పుట్టిన్రోజండీ’ ‘ఒరే ఒరే...ఆయనా నువ్వూ ఏదో కలిసి పుట్టినట్టు...ఏమిట్రా అదీ...సరిగా చెప్పు..’ ‘నేన్ సరిగా చెప్తా మాస్టారూ.....మహా నటుడు నటసామ్రాట్ నాగేశ్వరరావు గారి జన్మదినం’ ‘అదిరా..అలా ఉండాలి ....అక్కినేని నాగార్జున వాళ్ళ నాన్నగారనో, సుమంత్ వాళ్ళ తాత అనో అంటారనుకుని భయపడ్డాను. ఫరవాలేదే.....సరే....అ ఆ లు,గుణింతాలు గుర్తున్నాయి కదా ..ఇవాళ మీకు వైవిధ్యంగా ఉండేలా నేర్పుతా...వింటారా?’ ‘ఓ....వింటాం మాస్టారూ... చెప్పండి...’ ‘అ అంటే అక్కినేని, ఆ అంటే ఆదుర్తి’ ‘అవి ఇంటిపేర్లు కదండీ’ ‘అవునర్రా...అక్కినేని నటన, ఆదుర్తి దర్శకత్వం వెరసి తెలుగు సినీ కళామతల్లి జన్మ ధన్యమైంది. కాబట్టి ఈ అఆల గురించి అనుకోవడంలో తప్పేమీ లేదు’
0 Comments
Click to Zoom కొంప దీసి ఆ హెడ్డింగ్ నిజమనుకునేరు! అది ఎవరైనా కోరుకునేదే! ముఖ్యంగా ఈ సెప్టెంబర్ ఇరవైన పసి బాలుడు కానున్న మన అక్కినేని. ఇప్పుడు లెక్క వేసి అక్కినేనికి ఇన్నేళ్ళా అని చెప్పడమెందుకు? నిత్య యవ్వనుడు. ముందు అక్కినేని వారికి మనసారా పుట్టిన రోజు శుభాకాంక్షలుతెలియజేద్దాం. ఫోటోలో పొడవాటి ఆయన, పొడవాటి గడ్డమున్న ఆయన- ఆయన ఎవరో కాదు. ఎంత తాపీగా ఆలోచించినా చప్పున గుర్తుకొచ్చే పేరు- తాపీ ధర్మా రావు. నిన్నఆయన్ని మనసారా సంస్మరించుకున్నాం మన ధర్మంగా, ఆయన జయంతి కనుక. బరంపురం లో పుట్టి మదరాసు నేలిన కలం తాపీ వారిది. ధర్మారావు నాయుడు గానూ, తాతాజీ గానూ చిరపరిచితులు. యూనివర్సిటీ ఇచ్చిన బిరుదు-'ఆంధ్ర విశారద'. ఆ కలం 'పాత పాళీ' మార్చి 'కొత్త పాళీ' అమర్చి 'ఇనప కచ్చడాలు' 'పెళ్లి-దాని పుట్టు పూర్వోత్తరాలు', 'దేవాలయం మీద బొమ్మలెందుకు?' వంటి వెన్నో ఎడాపెడా రాసేస్తే ముక్కున వేలేసుకుంది ఆంధ్ర జనాభా. ఆయన ఎంత తాత్వికుడో అంత సాత్వికుడు. ఎంత మాటపొదుపరో అంత హాస్య చతురుడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇవాళ ఎనభై వసంతాలు చూసిన తెలుగు టాకీ ఆయన రచనలతోనే చిగురులు తొడుగుకొంది. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|