మునుపటి నా మాట
శ్రీరామ నవమి వచ్చి వెళ్లిపోతేనేం శ్రీరామా...నీ నామ ధ్యానం ఒక్క శ్రీ రామదాసు ఆ సుందర హనుమకే కాదు మాకూ నిత్య సంతోషమే. ఇదిగో ఇవాళ చైత్ర పౌర్ణమి! అయ్యో రామచంద్రా... పాక్షిక చంద్ర గ్రహణం అర్ధ రాత్రి దాటాక వస్తోంది. సూర్య వంశానికి చెందినవాడివి, శ్రీరామ చంద్రుడివి, పైగా భూమిజను స్వీకరించిన వాడివి - నీకు గ్రహణాల గురించి చెప్పాలా? అయినా- ఒక్క మంధర లాంటి వ్యక్తి చాలు స్వామీ వందలతో పనిలేదు, సాఫీగా సాగిపోయే సంసారాలకి గ్రహణం పట్టించడానికి, అల్లారు ముద్దుగా నిన్ను అడ్డాలనాడు చూసుకున్న ఆ కైకమ్మ వంటి అమ్మల బుద్ధి పక్క దార్లు పట్టించడానికి. ఏమైతే నేం! మీ నలుగురు సోదరులు మంచివారు. లక్ష్మణుడు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునేందుకు మీతో కదిలి వచ్చాడు. నీకు భరతుడంటే మక్కువెక్కువ! అతను వచ్చీ రాగానే నువ్వు అడవులకు వెళ్ళిపోయావని విని అడలి పోయాడు. 'తల్లి దురాశాయు, తండ్రి వియోగము(1)' విని నొచ్చుకుంది అతని నిష్కల్మష మది. నువ్వే రాజువి కావాలని బతిమిలాడాడు. ఆడి తప్పడం ధర్మం కాదన్నావు. పాదుకలిచ్చావు. వట్టి పాదాలతో వనవాసం చేశావు.
1 Comment
రెండేళ్ళ క్రితం 'దివి' సీమ వైపు హుటాహుటిన వెళ్ళిపోయిన ముళ్ళపూడి వెంకట రమణ గారు వందేళ్ళకైనా మరవలేని ఒక శ్లేష పలికారు- అడ్జస్ట్ 'మెంటాలిటీ' అని. ముళ్ళపూడి వారంటే బుడుగు ద్వారా బుడుగు తల్లి తండ్రుల భోగట్టాలు రాబట్టేలా తెలుగు వారికి కొత్త ధర్మం నూరిపోసిన రచయితా, సినీ రచయితానూ. అయితే 'తెలుసో ఏమో అందానికి అలకే అందం', 'మేడ మీద మేడ కట్టి కోట్లు కూడబెట్టినట్టి కామందూ..హలో హలో కమ్ అవుట్ ..రా ముందూ' లాంటి తొలి పాటలు రాసిన సినీ కవి అని కొందరికే తెలుసో ఏమో. అది ఆయన అడ్జస్ట్ మెంటాలిటీ. ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటే మేలు అన్నిటా కాలు పెడితే విరుగును కీలు - అని ఏ పెద్దాయనా చెప్పనట్టు జ్ఞాపకం. కాని ప్రతివాది భయంకర శ్రీనివాస్ ముళ్ళపూడి వారి ఈ రెండు పాటలూ పాడక ముందు నుంచీ ఒక అడ్జస్ట్ మెంటాలిటీకి అలవాటు పడిపోయారు. తన పేరు పొడి పొడిగా 'పి.బి.ఎస్' కదా, పి.బి. అంటే ప్లే బ్యాక్ అని శ్రీనివాస్ కాస్త శ్రీని 'వాయిస్' అని సినీ సీమ ముద్ర వేయగానే నవ్వుతూనే తన అడ్జస్ట్ మెంటాలిటీని కనపరిచారు. అయితే అసలే ఇండియా అందునా భాషలెక్కువ కాబట్టి పి.బి.ఎస్ మనసులో శత భాషలు శతభిషలు మొదలెట్టాయి- నన్నంటే నన్ను నీ 'వాక్కు'న చేర్చుకో అని తామంతా సతాయిస్తుంటే ఈయన కున్న అడ్జస్ట్ మెంటాలిటీ దేన్నిస్వీకరిస్తుందా అని. గొల్లప్రోలు వాడైనా గోపాలుడు కాదు. తెల్ల కాగితాలే తప్ప తెంపరితనం ఎరగడు. అందుకే ఆచి తూచి ఎనిమిది భాషలు పూర్తిగా నేర్చుకోవడమే కాక ఆయా భాషల కవిత్వ స్పూర్తితో తానూ వ్రాయడం మొదలెట్టాడు. ఇలా కాయితం, కలం తో భాషా అడ్జస్ట్ మెంటాలిటీ కన పరిచిన ఏకైక వ్యక్తి బహుశ: పి.బి.ఎస్ ఒక్కరేనేమో. ‘అయ్యా గోపాలం గారూ ...కొంచెం ఆలస్యమైనా...ఉగాది శుభాకాంక్షలు...’ ‘ప్రకాశం గారూ.. రండి రండి... శ్రీ విజయ నామ సంవత్సర శుభాకాంక్షలు...ఒక్క రోజే కాదు ఏడాది పొడుగునా...’ ‘చెప్పండీ.. మనం గానీ ఉగాది అని తప్పుగా అంటున్నామా? యుగాదియే కరెక్ట్ అనుకుంటా’ ‘ఉగాది అంటే యుగాదియే. యుండెడిది అనేది వ్యావహారికంలో ఉండెడిది అయినట్టే యుగాది కాస్త ఉగాది అయింది. కన్నడ వారు ‘యుగాది’ అనే అంటారు. మహారాష్ట్రలో గుడిపాడ్వ అంటారు. బ్రహ్మ యుగాన్ని ప్రారంభించేడని కృతజ్ఞతగా ఇంటింటా చిన్న గుడి కట్టి ఆహ్వానిస్తారు. ఇతరత్రా బ్రహ్మకి గుళ్ళు ఉండవు కదా.’ ‘బ్రహ్మ దేవుడు సరే..ఆయన గురుబ్రహ్మ. గోపాలం గారూ.. ఉగాది గురువారం నాడు వచ్చిందని అంటున్నానని అనుకోవద్దు..నిజంగానే మీరు మా గురువులు..’ ‘ఈ ఏడు ఉగాది గురువారం నాడు వచ్చింది కాబట్టి గురు గ్రహమే ఈ ఏడాదికి రాజండీ. అంత పెద్దవాడు సైతం... గురు అన్నా బృహత్ అన్నా పేద్ధ అనేగా అర్ధం ---అందుకే అతను బృహస్పతి... మరి ఈ పెద్దాయన సైతం సూర్యుడి చుట్టూ తిరగాల్సిందే. అంచేత ప్రకాశం మీరైనప్పుడు, మీదైనప్పుడు మేమెంతండీ.’ పాణికి గ్రహణంకి మధ్య ఓ గీత ఉంది గమనించండి. పాణి అంటే కోదండపాణి అని పాతిక శాతం మంది గ్రహిస్తే ఈ 'కృష్ణప్రేమ' జన్మ సార్ధకమైనట్టే లెక్క. కోదండపాణి అంటే సినీ సీమ మట్టిలో స్వర మాణిక్యం అని మరో పాతిక శాతం అనుకుంటే పాణి జన్మ ధన్యమైనట్టే. మిగతా యాభైశాతం మందికి ఆయన ఎవరో తెలియక పోతేనేం, అదీ ఎంతో మంచిదే. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఆయన గురించి చెప్పే అవకాశం కలుగుతుంది కనుక. మరి ఆ గ్రహణం మాటేమిటీ? పున్నమి కాదు-చంద్ర గ్రహణం అనడానికి. అమావాస్య కానే కాదు – సూర్య గ్రహణం అనడానికి. రాహుకేతుల హాహాకారాలు అవన్నీ. ఇక్కడ ఆరుద్ర గారన్న మాట గుర్తొస్తోంది. ‘పరిగెత్తి వస్తోంది రాహువు- అయ్యో తరిగి పోతోంది ఆయువు’. అలా కోదండపాణి ఆయువుకి గ్రహణం పట్టిన రోజిది. 1974 ఏప్రిల్ 5న ఆయన్ని గుటుక్కున మింగేశారు గంధర్వ లోక వాసులు. ఆ ఏడాది అప్పటికే ఫిబ్రవరి 11న గంధర్వుల దృష్టి ఘంటసాల మాస్టారు పైన పడింది. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|