మునుపటి నా మాట
పార్వతమ్మ గారికి వంటింటి హడావుడి తగ్గాక కాస్త తీరిక దొరికినట్టయింది. వాకిలికి, చావడికి మధ్యస్థంగా దూలానికి వేయించుకున్న ఉయ్యాల బల్ల మీద కాసేపు కూర్చున్నారు. కుయ్ కుయ్ అంటూ ఉయ్యాల చేసే శబ్దం ఆవిడ చెవికి తంబూరా నాదంలాంటిది. అలాంటప్పుడే ఏదో ఒక రాగం తీస్తూ ఆమె రిలాక్స్ అవుతుంటారు. అటునుంచి మనవరాలు కూడా ఏదో రాగం నెమ్మదిగా తీస్తూ ఆమెని చూసి చూడనట్టు చూసి వీత్తలుపు వైపు వెళుతోంది. ‘ఏవమ్మాయ్ సునందా...ఈ ఏడాది అట్లతద్దికి నువ్వు నీ స్నేహితురాళ్ళని పిలవలేదెందుకే? ఎవ్వరూ ఊళ్ళో లేరా ఏమిటీ? మనింటా వంటా ఉన్న ఆచారమే ...ఏడాదికోసారే కదే వచ్చే పండగది ...ఆనందం ఇస్తుందే...మీ తాతగారు వేయించిన ఉయ్యాల....ఆయనే ఉండి ఉంటే చెవులు మెలేసే వారు..’అని ఇంకా పార్వతమ్మ గారు చెప్పబోతుంటే ఇలాంటి ఉపన్యాసాలు అప్పుడప్పుడూ తనకు మామూలే అన్నట్టు సునంద ,’నానమ్మా ...స్నేహిత్ రాళ్ళూ రాప్లూ ...దిస్ ఇయర్ వుయ్ డింట్ గెట్ టయిమ్...అగ్లే సాల్ దేఖేంగే...లెట్ అజ్ సీ...’అని మణిప్రవాళం మొదలెట్టింది. పార్వతమ్మ గారికిదేం కొత్త కాదు కదా..ఆవిడా ఈ విషయంలో దిట్టే...’ఆ( ..ఏం సీ నో....ఒరే పిల్ల అట్లతద్ది ఆడాలిరా అంటే వినక సముద్రపొడ్డు...చందమామ ..ఆహా ఓహో అంటూ మిమ్మల్ని పట్టుకు పోయాడు మీ నాన్న. పైగా యూ సీ వాట్ పిల్లలు వాంట్ ఐ మస్ట్ డూ ఇట్ ఫర్ దెమ్ అని కూడా అన్నాడు ..ఏమిటో పండగ అంటే అదో దండగ అన్నట్టు రాను రాను తయారౌతున్నారు. సర్లే ...అట్లతద్దా, అట్లాంటిక్కా అంటూ మధ్యలో నాకెందుకీ ఊగిసలాట?..ఈ టీవీయో , మా టీవియో ఏదో ఒకటి చూస్తూ కూర్చోక...’ అని కొంచెం విసుగ్గా మొహం పెట్టారు.
0 Comments
‘రెడ్డిగారూ ....అక్టోబర్ నెలలో మా ఒడిశా మీద వాయు దేవుడికి వచ్చిన కోపం అంతా ఇంతా కాదు. ఆయన విసిరిన ప్రభంజన పంజాకి తల ఒగ్గి ఫైలిన్ తుపాను పెను గాలులు గంజాం, గజపతి జిల్లాల్ని అతలాకుతలం చేశాయి. గోపాలపురం, బరంపురం లాంటి ఊరి పేర్లు అందరికీ యిట్టె తెలిసిపోయాయి మీడియా పుణ్యమా అని. ఆ తరువాత వరుణ దేవుడికీ అంతే కోపమా? ఎడా పెడా వానలు కురిపించి వరదల పాలు చేశాడు. పంట నష్టం దారుణంగా జరిగి పోయింది. మొత్తానికి ఇలా ప్రకృతి ప్రకోపించింది అన్నమాట.’ ‘అవునండీ నాయుడు గారూ... కానీ ఒకటి లెండి.....ప్రకృతి కోపిస్తే నేనేం చెయ్యనూ? అని మీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు దులిపేసుకోలేదు, తన బలగం చేతులకి పని పెట్టించాడు. అసలు రాజు అనేవాడికి ప్రజ మీద బాగా ప్రేమాభిమానాలు ఉండాలి. చూడండీ...ఒక కుటుంబం బావుండాలంటే భార్యా భర్తల మధ్య అనురాగం ఉండాలి కదా....అలాగే రాజు, బలగం మధ్య అనురాగం ఉండాలి. ముఖ్య మంత్రి ముందస్తు జాగ్రత్తలు బాగా తీసుకుని లక్షలాది జనాన్ని మృత్యువాత పడనీకుండా ఫైలిన్ బారి నుంచి కాపాడారని అందరూ ప్రస్తుతించారు.’ |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|