మునుపటి నా మాట
రెండువేల పదమూడు డిసెంబర్ ఇరవై ఒకటి....శనివారం... అయితే ఏమిటట? విశేషమా? సూర్యుడు దక్షిణం వైపు వెళుతూ వెళుతూ ఈ రోజు ఇరవై మూడు డిగ్రీల ఇరవై ఆరు మినిట్స్ దగ్గర చేరుకొని ఎవరెస్టు శిఖరం ఎక్కినంత సంబర పడి, ఇహ చాల్లే అని ఉత్తర దిశ వైపు తిరుగు ముఖం పట్టడమే ఇవాళ్టి విశేషం. దీన్నే మనం....ఏదీ జనవరి పదిహేనుకి వస్తుందే...మకర సంక్రాంతి అనేది ....దానితో పోల్చవచ్చు. ఉత్తరాన ఉన్న పాశ్చాత్య ప్రపంచం అంతా ఈ రోజు నుంచే శీతాకాలం ప్రారంభం అని ఘోషిస్తుంది. పైగా..మరో నాలుగు రోజుల్లో జీసస్ జననం కనుక కొత్త సంవత్సరం రావడం, కొత్త ఆశలు, కొత్త సంతోషం కలగడం ఈ రోజు నుంచే మరి. శీతవేళ రానీయకు రానీయకు..శిశిరానికి చోటీయకు చోటీయకు ...అని దేవులపల్లి కవి మనసు పదేపదే కోరుకుంది. ఆ మనీషికి ఆమని ఒక్కటే ఆదర్శం. ‘ఆరు ఋతువులు ఆమని వేళలే మన తోటలో’, ‘ప్రతి రాత్రి వసంత రాత్రి’ అని ఆయన కలం విన్నవించుకున్నది ఇందుకే.
0 Comments
‘పిల్లలూ ఇవాళ తారీకేమిటర్రా?’ ’డిసెంబర్ 11’ ‘సంవత్సరంతోపాటు చెప్పండర్రా..’ ‘11-12-13…ఆయ్ ..మాస్టారూ అంకెలన్నీ వరసగా వచ్చాయి’ ‘అందుకే ..తేదీ చెప్పమన్నానర్రా....ఇలా వరసగా మూడంకెలు ఎప్పుడొస్తాయో చెప్పగలరా?’ ‘మళ్ళీ వందేళ్ళాగాలి కదండీ మాస్టారూ...అంటే ... ఇలాంటి రోజు మళ్ళీ రానే రాదు* కదండీ. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు**.. కదండీ’ ‘అవునర్రా...ఇప్పుడు మీరన్నారే .....అవే పల్లవులుగా రెండు పాటలొచ్చాయి. ఒకటి నేను మీలా స్టూడెంట్ గా ఉన్నప్పుడు డబ్భైల కాలంలో విన్నది. ఒకటి మీతో పాటు విన్నది ...ఈ దశాబ్దం నాటిది. సరే...అడుగుతున్నా ...ఇలాంటి రోజు మళ్ళీ ఎందుకు రాదు చెప్పండీ?’ ‘సంవత్సరంలో ఉండేవి పన్నెండు నెలలే కదండీ మాస్టారూ ...డిసెంబర్ తరువాత పదమూడవ నెల లేదు కాబట్టి’ ‘గుడ్ గుడ్ ...ఇలాంటి వరస కిందిటి సంవత్సరం కూడా వచ్చింది. ఆ మాట కొస్తే ఏదో ఒక నెలతో ప్రతి సంవత్సరమూ వచ్చింది. ఏదీ చెప్పండీ?’ అంతే కదా.. మనం వేసే ఆ అద్భత నూలు పోగే ‘చంద్ర హారం’ ..... పుడమి మీద నెలబాలుడు పుష్కల మైన వెలుగులు నింపేందుకు డిసెంబర్ 4న దిగుతున్నాడు. రెండు రోజుల క్రితమే అమావాస్య చీకటి లాంటి గర్భ సంచిలో ఉండి బయట పడేదెప్పుడా అని ఆశతో ఎదురు చూశాడు. సముద్రుడు ‘వారసత్వం’ సరే... ‘వంశోద్ధారకుడు’ రాబోతున్నాడని సంతోషిస్తున్నాడు. ------- ‘పెద్దక్కయ్య’ ‘లక్షమ్మ’ రాబోతున్న ‘రక్త సంబంధం’ తలచుకుంటూ పొంగి పోతోంది. ‘నన్న తమ్మ’ అని కన్నడంలో మురిసి పోతోంది. ‘తల్లిదండ్రులు’ ‘చంద్ర వంక’ చూసి అమ్మాయ్ ..వీడికి మన ‘సొంత వూరు’ ‘పల్లెటూరు’ లో ‘చుట్టరికాలు’ వెతికి ‘మేనకోడలు’ ని ఎత్తుకొచ్చి ‘పెళ్లి చేసి చూడు’ అని తనకే పెద్ద బాధ్యత అప్పగించే ఆ ‘రేపు నాదే’ కదా అని గర్వ పడుతోంది. ‘మంచి మనసుకు మంచి రోజులు’ అంటే ఇదే కాబోలు అనుకుంది. పార్వతమ్మ గారికి వంటింటి హడావుడి తగ్గాక కాస్త తీరిక దొరికినట్టయింది. వాకిలికి, చావడికి మధ్యస్థంగా దూలానికి వేయించుకున్న ఉయ్యాల బల్ల మీద కాసేపు కూర్చున్నారు. కుయ్ కుయ్ అంటూ ఉయ్యాల చేసే శబ్దం ఆవిడ చెవికి తంబూరా నాదంలాంటిది. అలాంటప్పుడే ఏదో ఒక రాగం తీస్తూ ఆమె రిలాక్స్ అవుతుంటారు. అటునుంచి మనవరాలు కూడా ఏదో రాగం నెమ్మదిగా తీస్తూ ఆమెని చూసి చూడనట్టు చూసి వీత్తలుపు వైపు వెళుతోంది. ‘ఏవమ్మాయ్ సునందా...ఈ ఏడాది అట్లతద్దికి నువ్వు నీ స్నేహితురాళ్ళని పిలవలేదెందుకే? ఎవ్వరూ ఊళ్ళో లేరా ఏమిటీ? మనింటా వంటా ఉన్న ఆచారమే ...ఏడాదికోసారే కదే వచ్చే పండగది ...ఆనందం ఇస్తుందే...మీ తాతగారు వేయించిన ఉయ్యాల....ఆయనే ఉండి ఉంటే చెవులు మెలేసే వారు..’అని ఇంకా పార్వతమ్మ గారు చెప్పబోతుంటే ఇలాంటి ఉపన్యాసాలు అప్పుడప్పుడూ తనకు మామూలే అన్నట్టు సునంద ,’నానమ్మా ...స్నేహిత్ రాళ్ళూ రాప్లూ ...దిస్ ఇయర్ వుయ్ డింట్ గెట్ టయిమ్...అగ్లే సాల్ దేఖేంగే...లెట్ అజ్ సీ...’అని మణిప్రవాళం మొదలెట్టింది. పార్వతమ్మ గారికిదేం కొత్త కాదు కదా..ఆవిడా ఈ విషయంలో దిట్టే...’ఆ( ..ఏం సీ నో....ఒరే పిల్ల అట్లతద్ది ఆడాలిరా అంటే వినక సముద్రపొడ్డు...చందమామ ..ఆహా ఓహో అంటూ మిమ్మల్ని పట్టుకు పోయాడు మీ నాన్న. పైగా యూ సీ వాట్ పిల్లలు వాంట్ ఐ మస్ట్ డూ ఇట్ ఫర్ దెమ్ అని కూడా అన్నాడు ..ఏమిటో పండగ అంటే అదో దండగ అన్నట్టు రాను రాను తయారౌతున్నారు. సర్లే ...అట్లతద్దా, అట్లాంటిక్కా అంటూ మధ్యలో నాకెందుకీ ఊగిసలాట?..ఈ టీవీయో , మా టీవియో ఏదో ఒకటి చూస్తూ కూర్చోక...’ అని కొంచెం విసుగ్గా మొహం పెట్టారు. ‘రెడ్డిగారూ ....అక్టోబర్ నెలలో మా ఒడిశా మీద వాయు దేవుడికి వచ్చిన కోపం అంతా ఇంతా కాదు. ఆయన విసిరిన ప్రభంజన పంజాకి తల ఒగ్గి ఫైలిన్ తుపాను పెను గాలులు గంజాం, గజపతి జిల్లాల్ని అతలాకుతలం చేశాయి. గోపాలపురం, బరంపురం లాంటి ఊరి పేర్లు అందరికీ యిట్టె తెలిసిపోయాయి మీడియా పుణ్యమా అని. ఆ తరువాత వరుణ దేవుడికీ అంతే కోపమా? ఎడా పెడా వానలు కురిపించి వరదల పాలు చేశాడు. పంట నష్టం దారుణంగా జరిగి పోయింది. మొత్తానికి ఇలా ప్రకృతి ప్రకోపించింది అన్నమాట.’ ‘అవునండీ నాయుడు గారూ... కానీ ఒకటి లెండి.....ప్రకృతి కోపిస్తే నేనేం చెయ్యనూ? అని మీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు దులిపేసుకోలేదు, తన బలగం చేతులకి పని పెట్టించాడు. అసలు రాజు అనేవాడికి ప్రజ మీద బాగా ప్రేమాభిమానాలు ఉండాలి. చూడండీ...ఒక కుటుంబం బావుండాలంటే భార్యా భర్తల మధ్య అనురాగం ఉండాలి కదా....అలాగే రాజు, బలగం మధ్య అనురాగం ఉండాలి. ముఖ్య మంత్రి ముందస్తు జాగ్రత్తలు బాగా తీసుకుని లక్షలాది జనాన్ని మృత్యువాత పడనీకుండా ఫైలిన్ బారి నుంచి కాపాడారని అందరూ ప్రస్తుతించారు.’ లలిత సంగీతం, సినిమా సంగీతం – ఏక రూపం నుంచి వచ్చిన రెండు అపురూప ఉప రూపాలు. ఏక రూపమైన సంగీతంలోనూ అంతే ... స్వరం, రాగం రెండు స్వరూపాలు. స్వరములు ఏడైనా రాగాలెన్నో – అని కవి అబ్బురపడితే పడు గాక - ఒకాయనకి మాత్రం ఏడు రాగాలు చాలు. యమన్, మాల్కోస్, భీమ్ పలాస్, మోహన, కమాజ్, జయజయవంతి, హరికాంభోజి అలాగని ఆ ఒకాయనకి తతిమ్మా రాగాలతో ప్రమేయం లేదని కాదు- ‘బహుదారి’ వంటి అరుదైన రాగానికి దారి చూపించింది ఆ ఒకాయనే. కాబట్టే ఆ దారిలో ‘నిలువుమా నిలువుమా నీలవేణీ’ (అమరశిల్పి జక్కన్న), అనగానే ఆగాయి పాదాలు. ‘నడు.. నడు...నడచిరా హంస వలె’ (చిలకా గోరింకా) అనగానే కదిలాయి పాదాలు. ‘బేహాగ్’ రాగాన్ని ఆప్యాయంగా ‘హగ్’ చేసుకున్నదీ ఆ ఒకాయనే. కాబట్టే ‘వర మొసగే వనమాలీ నా వాంఛితమ్ము నెరవేరునుగా’ (భక్త ప్రహ్లాద) అని నారదుడు విష్ణు భక్త ఆలింగనంలో కరిగిపోయాడు. 'అందాల రాశి ఐశ్వర్య రాయి బచ్చన్ ఎక్కడ కనిపించినా ఎవరో ఒకరు ఈల వేస్తూనే ఉంటారట. కాని వాళ్ళాయన ఉన్నాడే...అభిషేక్ ...అస్సలు ఈల వెయ్యడట’ ‘ఏమో...వాళ్ళిద్దరూ హాయిగా ఈల వేసి పిలవకోయి అని మన తెలుగు పాట పాడుకుంటారు కాబోలు. ఎవడికి తెలుసూ?’ ‘అయ్యో..జోకుల్తో అడ్డు పడకమ్మా.. తెలుగు పాడరు...ఆమె కన్నడం అందుకుంటుంది’ ‘కన్నడం అనగానే మరొక అందాల భరిణె శిల్పా శెట్టి గుర్తొస్తోంది’ ‘మహా ప్రభో ..నాకు తెలుసు ఎందరో ఎప్పటినుంచో చెవిలో ఇల్లు కట్టుకుని యోగాసనాలు వెయ్యండర్రా మంచిది మీ ఒంటికి అని అంటుంటే వినలేదు కాని ఈమె వీడియో రిలీజ్ చెయ్యగానే ఎక్కడ లేని హుషారు తన్నుకొచ్చి అంతా తెగ ఆసనాలు వేసేస్తున్నారు. బేడప్పా బేడ ..దయ విట్టు స్వల్ప నన్న మేలె దయ తోర్సీ ( వద్దు బాబూ వద్దు. దయ చేసి కొంచెం నా మీద దయ చూపండి)’ ‘ఓహో...వీడియో కావాలా? బెంగళూరు ఎమ్జీ రోడ్ లో అప్పుడెప్పుడో కొన్న ఆ ముప్ఫయి రోజుల్లో కన్నడం పుస్తక మహిమా ఇది. మా తండ్రే. అయినా ఈ పాత అందాలు బోరు బోరు. కొత్త అందాలుండగా.........’ ‘కొత్త ఒక వింత నాయనా ......మిస్ వరల్డ్ 2013 ... మెగాన్ యంగ్ అట. ప్రపంచం మొత్తం లో నూటా ముప్ఫై మంది లోంచి ఎన్నిక కావడం తమాషా కాదు’ ‘ఇవాళ ఏ తారీఖర్రా పిల్లలూ?’ ‘సెప్టెంబర్ ఇరవై అండీ మాస్టారూ ..’ ‘ఈ రోజు ప్రత్యేకత ఏమిటర్రా?’ ‘నే చెప్తా సార్’ ‘సార్ ..నే చెప్తా’ ‘నన్ను చెప్పనీండి సార్’ ‘నాకు తెల్సు సార్..నేనే చెప్తా’ ‘వదిలితే...మొత్తం అందరూ..ఏకకంఠంతో చెప్పేట్టున్నారే...ఉండండి..నువ్వు చెప్పరా నీలకంఠం..’ ‘నాగీస్సర్రావు పుట్టిన్రోజండీ’ ‘ఒరే ఒరే...ఆయనా నువ్వూ ఏదో కలిసి పుట్టినట్టు...ఏమిట్రా అదీ...సరిగా చెప్పు..’ ‘నేన్ సరిగా చెప్తా మాస్టారూ.....మహా నటుడు నటసామ్రాట్ నాగేశ్వరరావు గారి జన్మదినం’ ‘అదిరా..అలా ఉండాలి ....అక్కినేని నాగార్జున వాళ్ళ నాన్నగారనో, సుమంత్ వాళ్ళ తాత అనో అంటారనుకుని భయపడ్డాను. ఫరవాలేదే.....సరే....అ ఆ లు,గుణింతాలు గుర్తున్నాయి కదా ..ఇవాళ మీకు వైవిధ్యంగా ఉండేలా నేర్పుతా...వింటారా?’ ‘ఓ....వింటాం మాస్టారూ... చెప్పండి...’ ‘అ అంటే అక్కినేని, ఆ అంటే ఆదుర్తి’ ‘అవి ఇంటిపేర్లు కదండీ’ ‘అవునర్రా...అక్కినేని నటన, ఆదుర్తి దర్శకత్వం వెరసి తెలుగు సినీ కళామతల్లి జన్మ ధన్యమైంది. కాబట్టి ఈ అఆల గురించి అనుకోవడంలో తప్పేమీ లేదు’ సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించడంలో డిసెంబర్ నెలా, సెప్టెంబర్ నెలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి, ఎలా అంటే .. డిసెంబర్ లో winter solstice, సెప్టెంబర్ లో autumnal equinox వస్తాయి కాబట్టి. ఆ లెక్కన కాలం మారుతుంది. అలాగే ఒక న్యాయమైన తీర్పు చుట్టూ భారతీయుల మనసులు పరిభ్రమించడం గతేడాది డిసెంబర్ నెలలో ప్రారంభమై ఈ ఏడు సెప్టెంబర్ నెలతో ముగిసింది. కాలం మారింది. గాయాన్ని మాన్పింది. అందరి గురి ఒక ఆరుగురి పైన ఇన్నాళ్ళూ ఉండగా నలుగురికి ఉరితీత ఖాయం అన్న విషయం తెలిసి అందరి మనసులూ కుదుట పడ్డాయి. ఆరుగురిలో ఒకడు తనంతట తాను తల తెంచుకున్నాడు. మరొకడు ‘పాపం పసివాడు’ అన్న ధోరణిలో తప్పించుకున్నాడు. మిగతా నలుగురు కోర్టు తీర్పుకి తల దించుకున్నారు. ఒక డిల్లీ యువతి పట్ల జరిపిన పాశవిక చర్యకి వీళ్ళు ఉరికంబం ఎక్కడమే సరియైన న్యాయం అని న్యాయ దేవత గ్రహించింది. ఈ తీర్పు వెనక కోట్లాది గొంతుల ఆక్రోశం, ఆవేశం, సడలని పట్టు, శాంతియుత పోరాటం అన్నవి ప్రముఖ పాత్ర పోషించాయి. వాటికి జయం లభించింది. ఆ అభాగిని దామిని, నిర్భయగా అందరికి చెరొక కంటిలో అశ్రుకణంగా మిగిలినా ఆమె అసలు పేరు జ్యోతి. ఆ జ్యోతి తొమ్మిది నెలల క్రితం దారుణంగా ఆరిపోయింది. అయినా ఇవాళ నవ మాసాలు మోసి భారత మాత మళ్ళీ కన్న ఈ ఆడ శిశువుని న్యాయ దేవత తన తీర్పు పొత్తిళ్ళలో ఉంచి లోకానికి చూపించింది. దుష్టులుంటారు ....కరడు గట్టిన దుష్టుల్ని చూసినప్పుడల్లా,వినినప్పుడల్లా అయ్యో నారాయణా, దుష్ట శిక్షణ కోసం అవతరించు నాయనా అని ఎవరు మాత్రం కోరుకోరు? శ్రీకృష్ణుడు సంభవామి యుగే యుగే అన్నాడు. అంత భరోసా ఇచ్చిన వాడు ఏవో లెక్కలు తేల్చుకుని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూనే ఉన్నాడేమో ! బ్రహ్మ సృష్టించి, శివుడు నడిపిస్తే విష్ణువు ‘స్థితి’ బాధ్యత తీసుకున్నాడు. లోకం అనగానే దుష్టులూ,శిష్టులూ కలిసే ఉంటారు. కేవలం శిష్టులే ఉండరు. అలాగనీ అంతటా దుష్టులే ఉండరు. దుష్టత్వం మితి మీరినట్లయితే ఎప్పుడో ఒక చోట దానికి తెర పడాల్సిందే. శ్రీకృష్ణుడిగా ఒక పరిపూర్ణ అవతారమెత్తిన శ్రీమన్నారాయణుడు కృష్ణుడి ద్వారా తన అవతారాలన్నీ ఎందుకోసమో అన్నది స్పష్టం చేశాడు. తన శ్రీరామావతారంలో రాముడి ద్వారా నారాయణుడు పరశురాముడికి అంతకు ముందు తన అవతార రూపం పరశురాముడే అన్నది గుర్తు చేశాడు. ఇలా పలుకు పలుకులో ‘లే’ అక్షరం చేరి తెలుగు భాషకే ఒక అందం వచ్చింది. తెలుగువీర ‘లే’వరా ...అంటే ఇదేనేమో. ‘లే’ వరించిన తెలుగు వాడా అని సంబోధించడం. ఇప్పుడన్న మాటలు ఏవి కూడా లకారంతో ముగియలేదు. అయినా ‘లే’ ఒకటి వాటి చివర్లో చేరగానే ఆ మాటలకే ఒక కొత్త అందమొచ్చింది. లకారంతో ముగిసే స్త్రీ మూర్తులు ఇద్దరున్నారు. ఒకరు ఇల్లాలు. ఏక వచనం. మరొకరు కోడలు ఏక వచనం. ‘ల’ కొమ్మున్న నామవాచకాలివి. వీటికి ఏత్వం చేరి రెండు జాతీయాలు ఏర్పడ్డాయి. అత్తా ఒకింటి కోడలే, ఇంటికి దీపం ఇల్లాలే, ఇవే తరువాత సినిమా పేర్లయిపోయాయి. వీరు సరే. పురుష, స్త్రీ భేదం లేని వారున్నారు. దొంగలు. ఈ బహువచనానికి ఏత్వం చేరిస్తే చెప్పుకోదగ్గ దారుణమైన తీర్మానం - అందరూ దొంగలే. ఒక్క ‘లే’ చాలదని మరొక ‘లే’ గనక చేర్చామా - అత్తా ఒకింటి కోడలేలే, ఇంటికి దీపం ఇల్లాలేలే – అన్నప్పుడు ఎక్కడో వ్యంగ్య బాణం విసిరినట్టనిపించదూ? |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|