మునుపటి నా మాట
‘నా మది నిన్ను పిలిచింది గానమై వేణూ..’ ‘ఆ వస్తున్నా.. పిలిచారా రామం?’ ‘భలేవారండీ .. రఫీ గారి పాట పాడుతున్నా.. అంతే’ ‘ఓహో.. అలాగా.. వేణూ అని దీర్ఘం తీసి... ఆపితే.. నన్నే పిలిచారనుకున్నా’ ‘అదే నా బాధ.. పాపం ఆయన్నీ తెలుగు పాట పాడమన్నప్పుడు సంగీత దర్శకుడు..ఎవరూ.. సాలూరు హనుమంతరావు గారు.. ఎక్కడ విడగొట్టాలో, ఎక్కడ కలపాలో చెప్పలేదనుకుంటా’ ‘మీరన్నది నిజమే.. వేణూ గానమై అని వస్తుంది కదూ.. వేణుగానమైకి బదులు’ ‘హిందీ లో హ్రస్వాలతో ఇబ్బందే. అక్కడ దీర్ఘాలే హెచ్చు. రఫీ గారిదే ఇంకో పాట ..తార లెంతగా మెరిసేనో... అన్న పల్లవిలో ఆయన తారా లెంతగా .. అనే పాడారు. అంతే కాదు ఎంతవారుగానీ, ఎంతగా అనే చోట ఆయన యంతవారు, యంతగా అనే అన్నారు’ ‘ఇంతకీ నా మది నిన్ను పిలిచింది గానమై ..పాట ఎత్తుకున్నారు, విశేషం?’ ‘మదికీ, సంగీతానికి అనుబంధం ఉందా? ఉంటే.. తెలుగు వారికి అది హిందీ నుంచి వచ్చిందా... ఇదే నా ఆలోచన’ ‘అసలు మది అన్నది మతి: అన్న సంస్కృత శబ్దానికి వికృతి అండీ’
0 Comments
‘బావా ఎప్పుడు వచ్చితివీవు?...’ ‘ఇదిగో..ఇప్పుడేనండీ.. కాని ...బావగారూ..మరీ శ్రీకృష్ణ రాయబారం నాటకంలోలా వస్తూనే పజ్యం అందుకున్నారు మీరు ..’ ‘అంతేనోయ్.. పద్యం మా నేపధ్యం’ ‘కనక.. బంగారంలాంటి మరో పజ్యం అందుకోండి’ ‘చెల్లియో.. చెల్లకో..’ ‘అదిగో..మాటల్లో వచ్చేసింది మా చెల్లి..ఏమ్మా .. బావగారి పద్యాలు విని విని వంటలన్నీ మహా బాగా చేస్తున్నట్టున్నావ్’ ‘ఏం వంటో.. కంద పద్యం అందుకుంటానా ..కంద కూర వండేస్తుంది..’ ‘నయం కదండీ.. సీసం అందుకోలేదు మీరు’ ‘అప్పుడూ అంతే.. సీసాడు నూనె ..ఊ .. తెగ దుంపల వేపుడు ... సీసానికి తేటగీతి తోడైనట్టు వేపుడుకి తోటకూర ఒకటి!’ ‘చూడబోతే .. భరనభభరవ అంటే ఇడ్లీ రవ్వ , నజభజజజర అంటే జంతిక కరకర అనేట్టున్నారు మీరు’ ‘ఉత్పలమాల, చంపకమాల అటుంచి చెంగల్వ పూదండ గానీ తీసుకొచ్చావుటోయ్?’ ‘కృష్ణాష్టమి,జన్మాష్టమి, గోకులాష్టమి... మూడు రకాలుగా అనుకుంటూ వస్తున్నా .. గుర్తుందిలెండి బావగారూ.. అందుకేగా మీ దగ్గరికొస్త..’ |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|