మునుపటి నా మాట
'రా సన్నీ రా.. ఏవిటీ వేషం? 'వేషం ఏమిటి మామా, ఇది ఫేషన్' ‘బావుంది, మాయాబజార్ లో సి ఎస్ ఆర్ తో ముక్కామల అన్నట్టు అన్నావ్’ ‘నాన్నా నువ్వూ మీరంతా మాయబజార్ ని బట్టీ పట్టేరనుకుంటా—‘ 'మీకూ ఇష్టమని చెప్పి ఎవరో కుర్రవాళ్ళు కలర్ లో తీసారు కదా- అద్సరే గానీ మా టైం లో, మీ నాన్న చెప్పాడా, బెల్ బోటం అనేది ఉండేది. పైకి సన్నగా కింద వెడల్పుగా ఉండే పేంట్ అది. దాంతో వీధులన్నీ తుడిచేస్తూ నడిచే వాళ్ళం. పైగా నెత్తి మీద బొచ్చు కుక్క కున్నట్టు ఇంత తుప్ప జుట్టు, పెద్ద పెద్ద చెంపలూనూ' 'అంటే-- మీ కాలం వాళ్ళూ -- లైఫ్ బాగానే ఎంజాయ్ చేశారన్న మాట' 'పోలీసు వాళ్ళు కలగజేసుకుని ఇంక జుట్లు కత్తిరించేస్తాం అన్నంత వరకూ, ఓ, మా బాగానే ఉండేది వ్యవహారం' 'మీ టైం లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలే కదా- సినిమాల్లోనూ ఈ వేషం ఉండేదా?' 'అసలే ఫేషన్ అయినా సినిమాల నుంచే దిగుమతి అయ్యేది- అప్పటికీ ఇప్పటికీ ఇదే ఆచారం. ఇప్పుడు చూడు అమ్మాయిలు భుజం నుంచి చేతుల వరకు ఒక లాంటి ట్రాన్స్ పెరంట్ క్లాత్ వేస్తున్నారే---'
0 Comments
జా: హాయ్ గోప్యం గో: హాయ్ జాప్యం.. అయినా ఏం హాయిలెద్దూ.. వానలా సరిగా లేవు. ఉక్క పోత తగ్గదు..ఎలాగో మరి ఏడుకొండలవాడా! జా: ఏడుకొండలవాడా ..అంటే గుర్తొచ్చింది. వారం కిందట నేనడిగింది... శ్రీరంగం గోపాలరత్నం గారి పాట. ఏదో అరుదైన గాయకుల గురించి చెబుతున్నావు కదా అని అడిగా. వచ్చే వారం, కృష్ణ పక్షం అంటూ దాటేశావ్. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట... గో:ఎవరూ.. నేనా? జా: జోకా.. పాహిమాం.. ఆ పాట పాడుకుంటున్నానోయ్! గో: తెలుసులే.. సీనియర్స్ అవుతున్న కొద్దీ సీరియస్ అయిపోనక్కర్లేదులే... జా: ఇంతకీ.. ఆ పాట అప్పుడెందు కివ్వలేదూ? సదా ఇస్తానూ.. అని అనక పొతే ఇదిగో ఇలా సతాయిస్తాను. గో: పట్టువదలని విక్రమార్కుణ్ణి పట్టి విడవని బేతాళుడిలా..నువ్వున్నావే ..అమ్మమ్మమ్మ ...చెబుతాలే ఉండు.. అప్పుడన్ని పాటలిచ్చా కదా..సర్లే ..ఈ వారం ఈ పాట ఇద్దామని..వాయిదా వేసా. ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ 'ఒక పిలుపులో పిలిచితే' పాట ఎవరు రాసి ఉంటారంటావ్? జా: అది ..నాకు తెలిసి డబ్భైల నాటి సినిమా శ్రీ వెంకటేశ్వర వైభవం లోనిది కాబట్టి ..అందులో ఏడు కొండల శ్రీనివాసా మూడు మూర్తుల తిరుమలేశా, తెర తీయరా తిరుపతి దేవరా, కోటి ప్రభలతో స్వామి కోనేటి అలలపై ..లాంటి భేషైన పాటలు రాసారే ... ఆ ఆచార్య ఆత్రేయ గారే ఇదీ రాసి ఉంటారు’ 'వినీలాకాశం బదులు సినీలాకాశం అంటావ్' 'ఔ. అందులో ఘంటసాల మాస్టారు సూర్యుడంటాను. అభ్యంతరం లేదుగా?' 'ఓ.. నిరభ్యంతరంగా అను. అయితే బాలసుబ్రహమణ్యం చంద్రుడంటాను. సరేనా?' 'బాల చంద్రుడు అంటావ్' 'ఇక మీదట బాలు అనే అంటాను' 'ఘంటసాల వారిని మాస్టారు అనే అంటాను' 'సరే' 'ఓకే' 'ఎందుకు మాస్టారు సూర్యుడంటే - రోజూ సూర్యుడొస్తూ కొత్త వెలుగు తెస్తాడు చూడు- అలా మాస్టారి పాటలు ఎప్పటికప్పుడు ఏవో కొత్త సంగతులు చెబుతూ ఉంటాయి' 'అంతేగా.. అందుకే ఆయన మాస్టారు. ఎన్ని బ్యాచులకో టీచర్లు ఓపిగ్గా ఎంతెంత చెబుతారూ.. అలాగే ఈయనానూ' 'ఘంటసాల వారిని సూర్యుడన్నాం కాబట్టి బంగారు కిరణాలు ఆయన పాటలు. కాబట్టి స్వర్ణ యుగం ఆయనిది. అంటే ముప్ఫై ఏళ్ళ కాలం' 'దేర్ఫోర్ ..బాలు గారిది సిల్వర్ యుగం అందాం. చంద్రుడిది వెండి వెన్నెల కదా' 'సూర్యుడూ, చంద్రుడూ సంధ్యాకాలంలో చూడ ముచ్చటగా ఉంటారు కదూ. అలా మాస్టారూ, బాలుల మేలుకలయిక ఒక సంధి కాలంలో అంటే ఏడెనిమిది ఏళ్ళ కాలంలో జరిగింది' 'నన్ను చెప్పనీ.. వీరిద్దరి కాంబినేషన్ లో తొలిసారిగా వచ్చిన రెండు పాటలున్నాయ్ చూడూ.. ఏదీ--- ఎన్నాళ్ళో వేచిన ఉదయం ..ఒకటీ, ప్రతి రాత్రి వసంత రాత్రి... ఒకటి ... వీటిలో ఉదయం ఉంది, రాత్రి ఉంది... కాబట్టి మాస్టారు అండ్ బాలు డిజర్వ్ టు బీ కాల్ డ్ సూర్యుడూ అండ్ చంద్రుడూ..అయితే ...'సినీలాకాశం కేవలం వీరితోనేనా నిండి ఉంది?'...అని ఎవరైనా గొణిగితేనో?' |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|