మునుపటి నా మాట
అక్షరాల గవాక్షాల నుంచి ‘ఎగిసి’ వచ్చిన వెలుగు రేఖ - సి నా Ray (సి.నా. రె పుట్టిన రోజు- పండగే అందరికి)29/7/2011 సిసలైన నానుడి రెట్టించి పలికిన వారికి శుభాకాంక్షలు డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి – ఎంత పెద్ద పేరో అంత మహోన్నతమైన మనసు! అందరికీ ఆత్మీయులు. ఎందరికో ఆచార్యులు. చిన్నా పెద్దా అందరికోసం సి.నా.రె గా కుదించుకుపోయిన కవి శిఖరం. ఆయన పుట్టిన రోజు ఇవాళ. ఎనభై ఏళ్ళ క్రితం ‘(అక్షర) తారలెంతగా మెరిసేనో (ఈ కాబోయే కవి) చందురిని కోసం’! సి.నా.రె అనే గీత గోవిందులు ప్రస్తుత వయసులో 'అష్ట పదులు' దాటి సహస్ర పున్నములు చూడబోతున్నారు. ఈ సందర్భంగా కలికి వెన్నెల కెరటాల పైన , కలల ఆలలపైన చెరగని అక్షర విన్యాసంతో పాట నావను కల కాలం నడిపించి దిక్కు తోచక అల్లాడుతున్న సినీ లోకానికి దిక్సూచిగానూ , సాహితీ లోకానికి చుక్కాని గాను ఆయన ఉండాలని ఆకాంక్షిద్దాం. సి.నా.రె అనే మూడక్షారాల జ్ఞాన సముదాయంలో తెలుగు,ఉర్దూ, సంస్కృతం అనే మూడు భాషల సంగమముంది. సాహిత్య లోకం, సినీ లోకం, అధ్యాపక లోకం అనే మూడు మిషల మిశ్రమముంది. అన్నిటిని మించి సిసలైన నానుడి రెట్టించి పలికే జాతీయత ఉంది.
0 Comments
కవి దాశరథి కృష్ణమాచార్యులు(దాశరథి) వారి జయంతి ఈ రోజు (జూలై 22). భువి పైనే ఉంటే ఆయనికిప్పుడు 85 నిండేవి. ‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ, చలాకి మాటలు రువ్వుతూ’ మరెన్ని పాటలు ఇచ్చేవారో? పాతికేళ్ళ నాటి మాట ఆకాశంలో హంసయై హాయిగ ఎగిరి, మధ్యలో ‘వెన్నెలలో మల్లియలు మల్లెలలో ఘుమఘుమలు’ మరీ దగ్గరుండి ఆస్వాదించి, అటు పైన దివిలో విరిసిన పారిజాతం కోసుకొచ్చి భువికి తేవాలని కృష్ణమాచార్యులు పయనమై పోయి పాతికేళ్ళు కావొస్తోంది. ఆయన తన దారి వెతుక్కునీ మనకి తన గీతాల బాట మీద అడుగుజాడలు మిగిల్చారు. గీతాచార్యులు అనిపించుకున్నారు ఇక్కడ తొలిసారిగా రంగుల తేనె మనసులు (1965) ‘దివి నుండి భువికి దిగి వచ్చే దిగి వచ్చే పారిజాతమే నీవై నీవై’ అని కలవరిస్తే , మలి సారిగా ఒక కన్నె వయసు (1973) నలుపు-తెలుపు ప్రేమ ముచ్చటగా ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ అని పలవరిస్తే మధ్యలో లేత మనసుల (1966) సాక్షిగా ‘హలో మేడం సత్యభామా’ అని పలకరించినది ఎవరండీ ఈకృష్ణమాచార్యులేగా? అయితే ఈ ఆ‘కలి’ యుగం కన్నా ఆ ద్వా‘పర’ లోకమే మెరుగని ఎరుగని మనకు ఒక్కొక్క గీతంలో పారిజాత పరిమళం అద్ది ఇచ్చి తన విశ్వ రూపం ప్రదర్శించిన ‘గీతాచార్యుల’ని ఎందుకనుకోరాదూ? తిమిరంతో సమరం అగ్ని ధార తో సరి (* 'రచన' మాస పత్రిక 2003 లో నా స్వీయ రచన 'పగలే వెన్నెలా? అదెలా?' ప్రచురితమైంది. అదే రచన 'తెలుగు-వెలుగు' (NY,NJ,CT) స్వభాను ఉగాది ప్రత్యేక సంచిక లో రచన సంపాదకులు శ్రీ శాయి గారి చొరవతో పున: ప్రచురితమైంది. ఈ రచనలో నే చేసిందల్లా 2000 వ సంవత్సరం వరకు వచ్చిన తెలుగు సినీ పాటల్లో 'పగలు వెన్నెల కాయడం' అనే వింత ఆలోచన ఎప్పుడు ఎక్కడ ఎవరితో ప్రారంభమైంది? ఎంత మంది అనుసరిస్తూ వచ్చారు? అనేది పరిశీలించి తేల్చి చెప్పడం! అన్ని వేల పాటల్లో కేవలం పదకొండు మాత్రమే ఆ భావంతో రావడం ఆశ్చర్యంగా ఉన్నా దీటైన కవులంతా ఏదో ఒక సందర్భంలో ఆ భావన పట్ల ఉత్సుకత చూపడం ఆనంద పరుస్తుంది. ఇక్కడ 'ఈ పూట నా మాట' లో అదే రచనని 'తిరగ' రాసి సమర్పిస్తున్నాను. రచన తో పాటు 'పాటలు' వినే,చూసే అవకాశం ఇక్కడ సాధ్యమౌతోంది కనుక నా ప్రయత్నం మీకు ఆమోదమనీ భావిస్తాను. ఈ పూట 'గురి పూర్ణిమ' కనుక ఈ పగటి చందమామ, పగలే వెన్నెల భావాన్ని రాసిన,తీసిన, స్వర పరిచిన, గానం చేసిన సినీ మేధావులందరికీ ఈ నా రచనే గురు దక్షిణ. - డా. తాతిరాజు వేణుగోపాల్) 'చిలకలపూడి వారింటి కిలకిల పలుకులు ... అంటూ నిన్నా మొన్నా చెప్పి మా అల్లుడి మేనల్లుడు అన్నంత పనీ చేశాడోయ్ – ఇదిగో ఈ సోమవారం మహావిష్ణు శయనైకాదశి కదా మహానుభావుడే నిద్దరోతే మామూలు భావాల వాళ్ళం మేమెంత అని అంతా నిద్రపోతారేమో అని ముందస్తుగానే అంటే ఈ ఆదివారమే నా రేపటి జన్మ దినం అదేనోయ్ నా జయంతి ప్రకటించేసి ఏదేదో రాస్తున్నాడు- పైగా నా పాటలట, పద్యాలట, నా కామెడీ సీనులట –అవన్నీ కూడా ఇస్తున్నాడట. సంతోషం – మహదానందంగా ఉంది. వీళ్ళ జెనరేషన్ బావుందోయ్. మా కాలాన్ని కాలదన్నేయకుండా చేతులెత్తి మొక్కి కళ్ళకద్దుకుంటున్నారు. మన ఆశీస్సులే వారికి కొండంత బలం –అవునా?.. ఉండుండు ఝేవిటో అంటున్నాడు. నేనెప్పుడో రాసాను మా నాన్న గురించి, ఆయన ఇచ్చిన నా జాతక చక్ర వివరాలు కొద్దో గొప్పో నేన్ రాశాను. అవటా- మళ్ళీ ఇస్తున్నాడట. ఇవ్వడమే కాదు తను సంపాయించి పెట్టుకున్న మరాఠీ పంచాంగాల కట్టలు తిరగేసి నా ఏడు అంటే 1907 ప్లవంగ నామ సంవత్సరం పంచాంగం లో జులై నాటి ఆషాడ పక్షం వివరాలు కూడా ‘ఆహా.. ఆహాహా’ అనే ఏదో ఉందట అందులో భద్రంగా ఉంచాడట. దేవనాగరి తెలియక పొతే కష్టమే, అయినా 104 ఏళ్ళ కిందిటి సంపద వెలికి తీయడం ఎవరికైనా ఇష్టమే. ఇంకా చూస్తావేమిటి అలా ---లోపలికి పద' ‘పలక-బలపం తెచ్చావా?’
‘అది ఏనాటి మాట?’ ‘పోనీ- పుస్తకం, పెన్నూ తెచ్చావా?’ ‘మరీనూ.. ఇదీ ఎప్పటి మాట?’ ‘వైట్ బోర్డ్ – మార్కర్ పెన్?’ ‘ఈ మధ్యే ఇవీ హుష్ కాకి! ఉన్నవల్లా computer, monitor, key-board, mouse, and cell phone, without which there exists no house’ ‘పోన్లే – అవేనా అఘోరించాయ్ – సంతోషం – ఏదీ ఆ man eater చూస్తూ అన్నం తింటూ అయ్యిందా నీ పని. ఇంకా బుద్ధిగా నే చెప్పినవన్నీ సరిగా టైప్ చేసావంటే నీకు బోలెడంత అప్పిస్తాను, సరేనా?’ ‘అప్పు –మీరివ్వనక్కర్లె- మాకు క్రెడిట్ కార్డులున్నాయి. వాటితో సినిమాలు కూడా తీయొచ్చు’ ‘ఆ( - పెద్ద చెప్పొచ్చావ్.. మీరు ఇప్పటి సినిమాలే ధియేటర్ కి వెళ్లి చూడరు. ఇంకా మా కాలంవి ఏం చూస్తారూ? సినిమాలు తియ్యడం కూడానా?’ ‘మాకు యూ ట్యూబులుంటాయి – ఏది కావాలన్నా చూడగలం. అయినా యాభై ఏళ్ళ కిందట వచ్చిందే మీ మాయాబజార్ – దాన్ని కొత్తగా రంగుల్లో ముంచెత్తారు. అది మాత్రం ధియేటర్ లోనే చూసాం’ ‘ఝే(విటీ -- రంగుల్లోనా? నా తెల్ల గెడ్డం తెల్లగానే ఉంచారా? మార్కస్ బార్ట్లే తీసిన వెన్నెల సీను రంగుల్లో ఏం బావుంటుందీ? ట్యూబుల్లోంచి సినిమాలు చూడడమా? ఇంతకీ వీటిల్లో నేనేమన్నా అగపడతున్నానా లేదా? నాదసలే ఆజానుబాహు విగ్రహం. ఇంతకీ నా పద్యాలుంటాయా? పాటలుంటాయా??’ ‘అవా? వాటికైతే వెబ్బులు వెతకాలి’ ‘నీళ్ళ కోసం మబ్బులు వెతికినట్టు నా పద్యాల కోసం.. ఏమిటవీ.. వెబ్బులు వెతకాలా? ఏమిటీ సాలెగూళ్ళతో మంతనాలు?’ ‘మీలాంటి వారంటే గూడు కట్టుకున్న అభిమానం ఉన్న వాళ్లకి ఇక్కడే ఒక చోట వీబ్లీ సైటులో అవన్నీ సాధ్యమౌతున్నాయి’ ‘మళ్ళీ మరో కొత్త మాటా? వీబ్లీ ఏమిటీ హుబ్లీ లాగ. అయినా నేను పానగల్లు పార్కులో బాతాఖానీ చేసే వాణ్ణే ఆ ఫోటో ఒక్కటైనా ఎవరి దగ్గరైతే ఉందో వాళ్ళే అనంత పద్మనాభుడి కన్న గొప్ప వాళ్ళు’ ‘అరె. ఈ వార్త మీ దాకా వచ్చిందీ?’ ‘ఎందుకు రాదూ- ఈ ఏడాది అంటే 2011 లో ఈ జులైలో ఇంగ్లీష్ 11 వ తేదీ ఉందే అదే రోజు మన ఇండియా అంతటికీ 11 వ తిథి , అదేనోయ్ , ఏకాదశి – ఆషాఢ మాసం శుక్ల పక్షం ఏకాదశిని శయనైకాదశి అంటారు. అది ఈ అనంత శయనుడిదే అంటే పద్మనాభుడిదే. నా గొప్ప అనుకోకు గానీ – ఈ ఇంగ్లీష్ రోజునే నేను పుట్టాను. సరే నే చెప్తా రాసుకో అన్నవి నువ్వు రాసేట్టు లేవు గానీ ఒక మాట చెబుతా విను. బరంపురం విన్న’కోట’ వారితో మేం వియ్యమందితే వారి తాతి’రాజు’ వారు మాకు పరిచయమయ్యేరు- మా అల్లుడు లక్ష్మీనారాయణ్ అంటే మా మంజులమ్మాయ్ భర్త అనే వాడు- రాజులేని కోట (వారిది) –కోట లేని రాజు (వీరు) అనీ. మా అల్లుడి మేనల్లుడు నా గురించి రాస్తాడు. ఇదిగో మా అ.మే అబ్బాయ్- అఆ ఇఈ అంటూ ఇప్పుడా అక్షరాభ్యాసం? నువ్వేదో నన్ను గురించి పెన్ను పట్టుకునీ ఏదో గిలుకుతావనుకుంటే..’ ‘మీరంటున్న ఆ అ. మే. అబ్బాయే ఆ వీబ్లీ లో ఈ పూట నా మాట అంటూ పూట పూటకో మాట ,మాట మాటకో పాట అప్పచెబుతున్నాడండీ’ ‘సంతోషం – అయితే మనమెందుకిక్కడ? రంగ రంగ అనుకోక?’ ‘అలా అనుకోడానికే ఎస్ వీ రంగా రావు పాటల కొలువు పేర్చాడు’ ‘కొలువైతివా రంగ శాయి’! పూరీ జగన్నాథ్ అనే దర్శకుడు ఒకనాటి angry young man , ఇప్పటి soft man అమితాబ్ బచ్చన్ హీరోగా ‘Bbuddah –hoga terra baap’ (2011)అనే సినిమా తీసి దేశమంతటా చూపిస్తున్నది ఈ ఏడు ఈ జులై నెల ఆరంభంలోనే. ప్రపంచంలో ఎక్కడైనా సరే నేటి ముసలి వారు ఒకనాటి యవ్వనులే కదా. ఎందుకంత కోపమో? ఎవరిమీదా కోపం తెచ్చుకోని దేవుడు, అసలైన ఆ పూరీ జగన్నాథుడు మన జీవన యాత్ర సఫలం కావాలనే కోరికతో ఒడిశా లో తన రథ యాత్ర కి ఈ ఏడు స్వీకారం చుడుతున్నది ఈ జూలై తొలి ఆదివారమే. మహారాష్ట్ర లో ఆషాఢ మాసం సందర్భంలో మహావిష్ణు రూపమైన పాండు రంగడి సేవలో పిల్లలు, యవ్వనులు, పెద్దలు, పండు ముసలి వారు -- అంతా పండరీ పుర యాత్ర చేసేదీ ఈ జులై నెలలోనే. మనం కూడా ‘రంగ’ ‘రంగ’ అనుకోవాలంటే మార్గమే లేదా? ఎందుకు లేదూ? మన కోసం ఒక రంగడు ఈ జులై నెలలోనే పుడితేను! అతన్ని తలుచుకోవడమే మన తక్షణ కర్తవ్యమ్! ఎవరదీ? సామర్ల వెంకట రంగారావు నాబడు మన యస్వీ రంగారావు గారేనా? సాహసము శాయరా డింభకా! |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|