మునుపటి నా మాట
బాణీ భ్రమణం లో చివరాఖరి దశ అంటే నాలుగవ దశ కొచ్చేశాం.
భూమి కి చాలా దూరంలో ఉన్న గురు (బృహస్పతి) గ్రహం గానీ, శని గ్రహం గానీ సమీపంలోకి వస్తే టెలిస్కోపు సహాయంతో చూసేందుకు ఇష్ట పడడం సహజం. శని గ్రహమైతే చుట్టూ ఉండే రంగుల వలయాలు ఆకర్షణీయంగా ఉంటాయి. సినీ సంగీతంలోనూ అంతే , ఎక్కడో దూరాన ఏదో దేశం వారి చక్కని సంగీతం లయబద్ధంగానో, శ్రావ్యంగానో వినిపిస్తుంటే ఇలాంటిది మనకీ ఉంటే బావుణ్ను అని అనిపించడం నిజం. ఇదిగో అటువంటి ఇష్టాన్ని అర్ధం చేసుకునీ అందుకోసం ముందు నడుమూ తరువాత హర్మోనియం కట్టుకునీ అదే బాణీ లేదా అటువంటి వరసను అందించే ప్రయత్నం చేస్తుంటారు మన సంగీత దర్శకులు.
0 Comments
బాణీ భ్రమణం : భాగం 2 (కొనసాగింపు)
రాగం ఒకటే అయినప్పటికీ పాట నడిపిన తీరు లో తేడా ఉండడమే ఒక్కొక్క సంగీత దర్శకుడి బాణీ ఇదీ అని ప్రత్యేకించి చెప్పగలుగుతాం. అలా కాకుండా ఒకదానినొకటి పోలి ఉంటే ఒక్కోసారి ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్న నానుడి నిజం చేస్తూ ఒరిజినల్ కన్నా అనుసరించిన పాటే పెద్ద హిట్ కావొచ్చు. అనుక(స)రణో పాఖ్యానం లో ‘బాణీ భ్రమణం’ అనే కొత్త మాట ప్రయోగించి అందులో నాలుగు దశలు ఉన్నట్టు ప్రస్తావించాను. రెండో దశలో స్వర కర్త తన స్వంతబాణీ తో పాటు పర బాణీ మిళితం చేయడం గురించి ఒక మూడు తరాల ఉదాహరణ చెప్పాను. ఇందులో చేర్చ దగినవి మరి కొన్ని పాటలు ఉన్నాయి. తమిళం బిట్ హిందీలోకి, తెలుగు బిట్ కన్నడంలోకి, తెలుగు బిట్ తెలుగు లోకి, హిందీ బిట్ హిందీ లోకి అతి సునాయాసంగా చేరిపోవడం ఈ దశ లోని ప్రత్యేకత. అయితే ఇది ఆయా ‘బిట్స్’ పట్ల సంగీత దర్శకులకో, నిర్మాతలకో ఉన్న ‘ఇష్టం’ వల్ల సంభవించి ఉండవచ్చు. లేదా అలా మలిస్తేనే తమ పాట ఇంకా బాగా రాణిస్తుందని అనిపించడం వల్ల కావొచ్చు. ‘బిట్స్’ అంటే ఇక్కడ Better Improvisation Through Segments (BITS) అనే అర్థం చెప్పుకుంటే బావుంటుందేమో. మొత్తానికి అనుకరించే వారూ, అనుసరించేవారు మూల స్వర కర్తలకి ఇలా ‘బిట్స్’ ద్వారా ఋణపడిన వారు గానే గుర్తించాలి. మూల భాషల బట్టీ ఈ ఋణానుబంధం ఈ విధంగా ఉంటుందని ఉదాహరించవచ్చు: అను - అనే ఉపసర్గ పోలిక, సామీప్యము, సహార్థము, తరువాత అనే అర్థాలు సూచిస్తుంది. అనుకరణము- అనువాదము, అనుసరణము –ఇలా ఒక్కొక్క పదం ముందుగా ఉన్న ‘అసలు’ అనే మూల పదార్ధానికి తరువాత వచ్చే ‘నకలు’ అనే భావమే వ్యక్తం చేస్తుంది. మండే వేసవిలో కొమ్మల చాటునుండే కోయిల రెండే సెకండ్లు ‘కూ కూ’ అనగానే ఎక్కడ లేని ఉత్సాహంతో మనం కూడా ‘ కూ కూ’ అని బదులు పలుకుతాం. అలా అనుకరణ ప్రారంభమౌతుంది.
కవిగా దేవులపల్లి వారు షెల్లీ, కీట్స్ వంటి మహాను ‘భావ’ కవిత్వాన్ని తేట తేట తెలుగు మాటలతో తన దైన శైలితో మనకు పరిచయం చేయడమే మనకు తెలుసు. ఆయన కవిత్వాన్నే కాక ఆయనకుండే గిరజాల జుట్టును కూడా అనుసరించి అనుకరించిన కవులుండే వారట ఆ రోజుల్లో. నచ్చే ‘అసలు’ ఉన్న చోట మెచ్చే ‘నకళ్ళు’రావడం నిజం. అసలు-ఏక వచనం. నకలు-నిత్య బహు వచనం. మన తిథులు మన విధులు చిత్రమైనవి కదూ – చైత్రం వచ్చి వెళ్లి పోగానే వైశాఖమొచ్చింది. మూడవ తిథి ఏకంగా ‘అక్షయ తృతీయ’ అనే బరువైన పేరు మోసుకొచ్చింది. ‘అట్ల తదియ’ ముచ్చట్లు తెలిసిన తెలుగు పడతులు ఇప్పుడిప్పుడే ఈ ‘అక్షయ తదియ’ పట్ల కూడా శ్రద్ధ చూపిస్తున్నారు. ‘నీ ఇల్లు బంగారం కానూ’ అని వేటూరి వారు ఎప్పుడో పాట రాస్తే ఇదేదో బావుందే అని ఇంటి బంగారం కోసం ఇప్పుడు పరుగులు పెడుతున్నారు. బంగారం లాంటి మా బంగారం షాపులో తదియ కన్నా ముందే బుక్ చేస్తే ఇంత శాతం డిస్కౌంట్ అంటుంటే అక్కడ పెరిగే రద్దీ ఇంతా అంతా కాదు. ఆ రోజు గానీ బంగారం ఇంటికొస్తే ముందు ముందు జీవితమంతా బంగారమే అనే బంగారు కలలు కనడానికి కాస్త తొందరగానే నిద్దరోతున్నారు ఇంటికి దీపాలయిన ఇల్లాండ్రు. ఆ రోజు ముహూర్తాలతో పనే లేదు. అందుకే జూనియర్ల, సీనియర్ల పెళ్ళిళ్ళు, నియర్ అండ్ డియర్ ల కొత్త ఇంటి బుకింగులు—ఇలా ఈ ఒక్క రోజే జరుగుతుండడం యాంత్రిక జీవన మార్గంలో వచ్చిన ఒక కొత్త మలుపు అనవలసిందే.
‘ఈ సారి నన్ను కులాసా కబుర్లకి రమ్మంటున్నావని తెలిసిపోయింది గోపాలా’ ‘అవునవును బాలాజీ, మనం మనం బరంపురం. శ్రీ శ్రీ స్పృహ తొలి సంచిక అట్ట మీద ఓ కవిత రాశారు గుర్తుందా. అందులో బరంపురం బదులు బర్హం పుర్హం అన్నారు. బర్హ: అంటే నెమలి పురి అని లేటుగా తెలిసింది’ ‘నెమలి పింఛమనగానే కృష్ణుడు గుర్తొస్తాడు. కృష్ణుడు అనగానే పడమట ద్వారక లాగ ఇక్కడ తూర్పున మన గోపాల పురం గుర్తొస్తుంది. గోపాల పురం అనగానే సముద్రం గుర్తొస్తుంది. ఎన్నెన్ని తుపాన్లు భరిస్తుంది పాపం.’ ‘కదా. గోపాల పురం మన బరంపురానికి వేసవి విడిది. అక్కడ వేణుగోపాల స్వామి కోవెల ఉంది చూశావూ’ ‘చూడకేం? Bank వాళ్ళు ఆ వూరి జన సేవకి నన్ను మూడేళ్ళు పురమాయిస్తేనూ’ ‘ఆ వేణుగోపాల స్వామి పేరే నా పేరని మా అమ్మ చెప్పేది. అదేం చిత్రమో, గోపాల పురం, విశాఖపట్నం సముద్రాలు ఎన్ని సార్లు చూసినా నేను మాస్టర్ లెవెల్లో సముద్ర శాస్త్రం చదువుతానని ఎప్పుడూ అనుకోలేదు. దీన్ని మా పరమగురు మిత్రుడు సాముద్రిక శాస్త్రం అని చమత్కరించే వాడు. శ్రీశ్రీ గారికి సముద్రమంటే ఎంతో ఇష్టం కదా. అంచేత వాళ్ళ అబ్బాయి రమణ మెరైన్ సైన్స్ చదివినట్టు గుర్తు’ ఇందర్ని తలుచుకునే క్రమంలో ఒక సారి ఏదీ ‘కనులు చూసినా పాటే’ క్లిక్ చెయ్యి. చూసావా- మధుర కంఠం తో భానుమతి ‘శ్రీ కర కరుణాల వాల వేణుగోపాలా’ ఎలా ఆలపిస్తున్నారో. ఇప్పుడు చెప్పు మన ఈ కులాసా కబుర్లలో ఇవాళ ఎవర్ని ప్రముఖంగా తలుచుకుంటామో? ’ |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|