మునుపటి నా మాట
'రా సన్నీ రా.. ఏవిటీ వేషం? 'వేషం ఏమిటి మామా, ఇది ఫేషన్' ‘బావుంది, మాయాబజార్ లో సి ఎస్ ఆర్ తో ముక్కామల అన్నట్టు అన్నావ్’ ‘నాన్నా నువ్వూ మీరంతా మాయబజార్ ని బట్టీ పట్టేరనుకుంటా—‘ 'మీకూ ఇష్టమని చెప్పి ఎవరో కుర్రవాళ్ళు కలర్ లో తీసారు కదా- అద్సరే గానీ మా టైం లో, మీ నాన్న చెప్పాడా, బెల్ బోటం అనేది ఉండేది. పైకి సన్నగా కింద వెడల్పుగా ఉండే పేంట్ అది. దాంతో వీధులన్నీ తుడిచేస్తూ నడిచే వాళ్ళం. పైగా నెత్తి మీద బొచ్చు కుక్క కున్నట్టు ఇంత తుప్ప జుట్టు, పెద్ద పెద్ద చెంపలూనూ' 'అంటే-- మీ కాలం వాళ్ళూ -- లైఫ్ బాగానే ఎంజాయ్ చేశారన్న మాట' 'పోలీసు వాళ్ళు కలగజేసుకుని ఇంక జుట్లు కత్తిరించేస్తాం అన్నంత వరకూ, ఓ, మా బాగానే ఉండేది వ్యవహారం' 'మీ టైం లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలే కదా- సినిమాల్లోనూ ఈ వేషం ఉండేదా?' 'అసలే ఫేషన్ అయినా సినిమాల నుంచే దిగుమతి అయ్యేది- అప్పటికీ ఇప్పటికీ ఇదే ఆచారం. ఇప్పుడు చూడు అమ్మాయిలు భుజం నుంచి చేతుల వరకు ఒక లాంటి ట్రాన్స్ పెరంట్ క్లాత్ వేస్తున్నారే---'
0 Comments
జా: హాయ్ గోప్యం గో: హాయ్ జాప్యం.. అయినా ఏం హాయిలెద్దూ.. వానలా సరిగా లేవు. ఉక్క పోత తగ్గదు..ఎలాగో మరి ఏడుకొండలవాడా! జా: ఏడుకొండలవాడా ..అంటే గుర్తొచ్చింది. వారం కిందట నేనడిగింది... శ్రీరంగం గోపాలరత్నం గారి పాట. ఏదో అరుదైన గాయకుల గురించి చెబుతున్నావు కదా అని అడిగా. వచ్చే వారం, కృష్ణ పక్షం అంటూ దాటేశావ్. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట... గో:ఎవరూ.. నేనా? జా: జోకా.. పాహిమాం.. ఆ పాట పాడుకుంటున్నానోయ్! గో: తెలుసులే.. సీనియర్స్ అవుతున్న కొద్దీ సీరియస్ అయిపోనక్కర్లేదులే... జా: ఇంతకీ.. ఆ పాట అప్పుడెందు కివ్వలేదూ? సదా ఇస్తానూ.. అని అనక పొతే ఇదిగో ఇలా సతాయిస్తాను. గో: పట్టువదలని విక్రమార్కుణ్ణి పట్టి విడవని బేతాళుడిలా..నువ్వున్నావే ..అమ్మమ్మమ్మ ...చెబుతాలే ఉండు.. అప్పుడన్ని పాటలిచ్చా కదా..సర్లే ..ఈ వారం ఈ పాట ఇద్దామని..వాయిదా వేసా. ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ 'ఒక పిలుపులో పిలిచితే' పాట ఎవరు రాసి ఉంటారంటావ్? జా: అది ..నాకు తెలిసి డబ్భైల నాటి సినిమా శ్రీ వెంకటేశ్వర వైభవం లోనిది కాబట్టి ..అందులో ఏడు కొండల శ్రీనివాసా మూడు మూర్తుల తిరుమలేశా, తెర తీయరా తిరుపతి దేవరా, కోటి ప్రభలతో స్వామి కోనేటి అలలపై ..లాంటి భేషైన పాటలు రాసారే ... ఆ ఆచార్య ఆత్రేయ గారే ఇదీ రాసి ఉంటారు’ 'వినీలాకాశం బదులు సినీలాకాశం అంటావ్' 'ఔ. అందులో ఘంటసాల మాస్టారు సూర్యుడంటాను. అభ్యంతరం లేదుగా?' 'ఓ.. నిరభ్యంతరంగా అను. అయితే బాలసుబ్రహమణ్యం చంద్రుడంటాను. సరేనా?' 'బాల చంద్రుడు అంటావ్' 'ఇక మీదట బాలు అనే అంటాను' 'ఘంటసాల వారిని మాస్టారు అనే అంటాను' 'సరే' 'ఓకే' 'ఎందుకు మాస్టారు సూర్యుడంటే - రోజూ సూర్యుడొస్తూ కొత్త వెలుగు తెస్తాడు చూడు- అలా మాస్టారి పాటలు ఎప్పటికప్పుడు ఏవో కొత్త సంగతులు చెబుతూ ఉంటాయి' 'అంతేగా.. అందుకే ఆయన మాస్టారు. ఎన్ని బ్యాచులకో టీచర్లు ఓపిగ్గా ఎంతెంత చెబుతారూ.. అలాగే ఈయనానూ' 'ఘంటసాల వారిని సూర్యుడన్నాం కాబట్టి బంగారు కిరణాలు ఆయన పాటలు. కాబట్టి స్వర్ణ యుగం ఆయనిది. అంటే ముప్ఫై ఏళ్ళ కాలం' 'దేర్ఫోర్ ..బాలు గారిది సిల్వర్ యుగం అందాం. చంద్రుడిది వెండి వెన్నెల కదా' 'సూర్యుడూ, చంద్రుడూ సంధ్యాకాలంలో చూడ ముచ్చటగా ఉంటారు కదూ. అలా మాస్టారూ, బాలుల మేలుకలయిక ఒక సంధి కాలంలో అంటే ఏడెనిమిది ఏళ్ళ కాలంలో జరిగింది' 'నన్ను చెప్పనీ.. వీరిద్దరి కాంబినేషన్ లో తొలిసారిగా వచ్చిన రెండు పాటలున్నాయ్ చూడూ.. ఏదీ--- ఎన్నాళ్ళో వేచిన ఉదయం ..ఒకటీ, ప్రతి రాత్రి వసంత రాత్రి... ఒకటి ... వీటిలో ఉదయం ఉంది, రాత్రి ఉంది... కాబట్టి మాస్టారు అండ్ బాలు డిజర్వ్ టు బీ కాల్ డ్ సూర్యుడూ అండ్ చంద్రుడూ..అయితే ...'సినీలాకాశం కేవలం వీరితోనేనా నిండి ఉంది?'...అని ఎవరైనా గొణిగితేనో?' జూన్ 17...జూన్ 15....జూన్ 13 అలా చదువుతూ పోతుంటే కేలండర్ రెండేసి రోజుల తేడాతో వెనక్కి పోతున్నట్టు అనిపించడం సహజం. కాల గమనంలో ఒక్కసారి జ్ఞాపకాల దారుల్లో ఆగి వెనక్కి చూస్తే ఆ మూడు రోజులు మన మధ్య లేని మహా పురుషులు ముగ్గురుని గుర్తు చేస్తాయన్నది నిజం. జూన్ పదిహేడున ‘అచ్చ తెనుగుభాష’ పుట్టింది, ఎప్పుడూ, 1905లో. జూన్ 15 న ‘విప్లవ భాష’ కనుమరుగైంది, ఎప్పుడూ, 1983లో. జూన్ 13న ‘గజల్ షాయరీ భాష’ మరో రూపంలో మూగ బోయింది, ఎప్పుడూ ... మొన్న మొన్ననే. అచ్చ తెనుగు భాష కి తెలుగువాళ్ళు పెట్టిన ముద్దు పేరు – మల్లాది రామకృష్ణ శాస్త్రి . విప్లవ భాష తెలుగు వాళ్ళకి నేర్పిన పెద్ద పేరు – శ్రీరంగం శ్రీనివాసరావు. ఇక్కడ దేశం లోని రాజస్తాన్ లోని ‘లూనా’ లో పుట్టి, పొరుగు దేశానికి వలస పోయి కుస్తీ పట్టు తో పాటు పట్టుదలతో గళం సవరించి ‘గజల్ షాయరీ’ భాషకొక రంగు, రుచి, వాసన ఉంటుందని తెలియజేసిన గాయక శిఖామణి పేరు- మెహదీ హస్సన్. మల్లాది వారి తెలుగు కరువై దాదాపు యాభై ఏళ్ళవుతోంది. మహాకవి కదిలించిన సాహితీ విప్లవ రధం ఆగిపోయి ఇంచుమించు మూడు దశాబ్దాలౌతోంది. ‘అనుకున్నామని జరగవు అన్ని... అనుకోలేదని ఆగవు కొన్ని’ – ఎంత బాగా అన్నారు మనసు కవి! వాన కూడా అటువంటిదే. ఇదిగో వచ్చేసింది కొబ్బరి తోటల కేరళకి అని ప్రకటిస్తే అవునుస్మీ ఎవరబ్బా, జబ్బ చరిచిందీ దెబ్బకి కదిలొచ్చింది అని బహుళ ప్రాసలతో బహుదానంద పడ్డాం. అది అంతలోనే చతికిలపడి పోయింది. అయినా ఆశ ఉంది... ఆలస్యమైనా ఆంధ్రలో అమృత ధారలు కురుస్తాయని! ఆ వాన రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూడాలి. అంటే ఓ ఐదువందలమంది ఎదురు చూస్తే చాలా? ఎవరది? మరీ లెక్క కట్టి చెబుతున్నారు. బొత్తిగా అతిశయోక్తులు గిట్టవా ఏమిటీ? ‘ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాలా’ అని శాంతకుమారి ఆర్ద్రంగా పాడితే గోపాలుడు ఆలస్యం చెయ్యనే చెయ్యడు. కన్నులేమిటీ, కాయలు కాయడమేమిటీ—మళ్ళీ ఎవరదీ? జాతీయాలు తెలియని జాతి కాదురా మనదీ. కేరళలో అనంత పద్మనాభుడు ఒక్కసారి నిద్రలేచినట్టున్నాడు – ఇన్నాళ్ళు శయనిస్తుంటే బంగారపు రాశులంటూ కేకలూ బొబ్బాలూనూ ... ఆయన మాత్రం ఎలా నిద్ర పోగలడు? ‘చూడ కళ్ళు చాలవనుకో’ – ఏదీ అతని శయన మూర్తి చూడ ..కాదు, అడుగున ఉన్న బంగారు రాశులు చూడ ... ఏ నోట విన్నా ఏ పూట విన్నా ఇదే మాట. జూన్ నెల ఆరంభం అంటే కేరళలో ‘వానా కాలం వచ్చేసిందోచ్’ అని కొబ్బరి తోటలు తలలూపాల్సిన సమయం. ఇక అక్కణ్నుంచి మెల్ల మెల్లగా ఆంధ్రలోకి ఋతుపవనాలు ప్రవేశించడానికి ఆస్కారం కల్పించే దశ. అయితే ఈ ఏడాది (2012) ‘మరి కొంచెం నిద్దురకానీ’ అన్నట్టు కేరళ వైపు ఋపవనాల రాక కొద్దిగా ఆలస్యమౌతోంది. ‘ఇంకా ఎండల కుంపటి నెత్తిని పెట్టుకు ఊరేగాలా’ అని దేశం మొత్తం అందరిలోనూ ఒక నీరసం ఆవహిస్తోంది. ఊరేగక పోయినా, ఉన్న ఊళ్ళో ఉన్నా దొందూ దొందే. ఇక్కడ కుంపటి అక్కడా రాజుకుంటోంది. జూన్ నెల ప్రారంభ కాలంలో ఈ రాజుకోవడం మాట పక్కన పెట్టి కోవా లాంటి ‘రాజా’ వారి గురించి అనుకోవడం ఈ పూట కాస్త రిలీఫ్ అనిపించదూ? ఇంతకీ ఏ రాజా వారో? ‘అయ్యా...మాకు స్కాములూ గట్రా తెలియవండీ ..ఏదో సంగీతం పిచ్చ ఉన్న వాళ్ళం ...మాకు తెలిసి ఇద్దరే రాజాలు – ఒకరు మెత్తని గొంతు గలాయాన ఎ ఎం రాజా – ఆయన లేరు. ఇంకో ఆయన – లయని ఆలయం గా మార్చుకున్న ఇళయరాజా – ఆయన పుట్టిన రోజు జూన్ 2న (జూన్ 3 అని కొందరంటారు). ‘ హమ్మయ్యా ...ఈయన ఊసెత్తితే మంచిది...కాస్త ఏ(విటీ...చాలా రిలీఫ్ మాకు’ అని కోరే వారి సంతోషం కోసమే ‘ఈ పూట నా మాట’. ఇళయరాజా వారి ఒంటి వయసు ఇప్పుడు 69 ఏళ్ళు. 33 ఏళ్ళ నాటికి గాని ‘స్వతంత్ర స్వర కర్త’ అనే ముద్ర పడలేదు ఆయనకి. ఇ’ళ’యరాజా కి వరాలిచ్చిన తమిళం ‘అన్నక్కిళి’ , తెలుగు ‘భద్రకాళి’ లోని ‘ళ’ కార వేళా విశేషమేమో గానీ మనిషి సరళం, మేధ బహుళం, స్వీయ బర్మన్ గళం, సర్వ manగళం, నవ్వుల గంగాళం, సమ్మోహన వాద్య మేళం------ఇంత నిక్షిప్త గుణ సంపత్తి ‘కల వారు’ రాజా వారు. ‘సూర్య ‘భగభగ’ వానుడు అని ఈమధ్య ఓ ప్రముఖ న్యూస్ పేపర్ లో వచ్చిన హెడ్డింగ్ చూశాను. ఎవరి ‘పన్’ డిత్యమో గానీ , బాగానే ఉంది!’ ‘ఏం బాగో? ఎండలు మాడి మసి చేస్తుంటే’. ‘ఇదేం కొత్తకాదు, మన అమ్మమ్మల చిన్నతనంలో ఉన్నట్టే ‘రోహిణీ కార్తుల్లో’ ఎండలు ఇప్పుడూ ఉంటున్నాయి. అయితే ఓ పదేళ్లుగా ఏ ఏటికి ఆ ఏడే ‘ఈసారి ఎండలు నెత్తిని నిప్పుకుండలు’ అని ఉక్క భరించ లేక తిక్క తిక్కగా ప్రవర్తిస్తున్నాం. ఎండల్లాగే పుచ్చు రాజకీయాలు మన బుర్రల్ని దొలిచేస్తున్నాయి. అలా ఊడిపడిన పెచ్చులు ‘భూగోళ తాప ప్రభావం’ అని సరిపెట్టుకుంటే సరి. పాత ఊరే మన కొత్తగూడెం. కాని అత్యధిక ఉష్ణోగ్రత 51 డిగ్రీలకి చేరుకునీ ఎప్పటికప్పుడు కొత్తగా గిన్నీస్ రికార్డ్ కెక్కబోతుంటే తన్నేసి పోతున్నారు. కొన్నేళ్ళ క్రితం కూడా రామగుండం లో ఇలాగే 50 డిగ్రీలు దాటితే అది రికార్డ్ కెక్కడం చూశామా? ‘అబ్బబ్బ బ్బ ! దొంగ లం.కొ. వంద రూపాయలు కొట్టేశాడు, నన్నేమార్చి’ – రాఘవరావు ఇంట్లో కాలు పెడుతూనే పెళ్ళాంతో అన్నాడు. ‘సర్లే. ఏంటా తిట్టు... మెల్లగా..., చుట్టు పక్కల వాళ్ళు వింటారు..’ అందామె. ‘వాళ్ళు వినటానికి మెల్లగా తిట్టమంటావా?’ –రా.రా. సరసోక్తి. ‘సర్లే సంబడం’ –ఆమె ఊత పదం. ‘ఎలా మోస పోయానో నాకే అర్ధం కావడం లేదు’ , గొణుగుడు ఆపలేదు ఆయన. ‘సర్లేవోయ్, దానికంత చింత ఎందుకూ? అవునుగానీ, చెప్పా గుర్తుందా, పనమ్మాయికి రేపు జీతమిస్తానని మాటిచ్చా. తెచ్చావా? లేక పొతే దొంగ ముం. మరో మూడు రోజులు పని మానేస్తుంది’ ఆమె బాధ ఆమెది. ‘ఆవిడగారు మానేస్తే నాకే కదా శిక్ష... తెచ్చా.. పనంటే గుర్తొచ్చింది దొంగ వెధవ జురాసిక్ కి ఫోన్ చెయ్యాలి. ’ –రా.రా ధోరణే అంత. ఆమెకి తెలుసు ‘జురాసిక్’ అంటే ఈయన గారి కొలీగ్ కె.సి.రాజు పేరు తిరగేసి ఈయన కోడై కూస్తున్నాడని. రాకరాక తన చెల్లెలు గిరిజ వస్తే ఈయన గారి కోడ్ లాంగ్వేజ్ తెలియక ఎంత భయపడిందీ.. ఈయన రాగానే చెల్లెలు సోఫాలో కూర్చున్నది కాస్త లేచి నిలబడితే ‘ఫరవాలేదు జరిగి, కూర్చో’ అన్నాడు. అప్పుడు తనే చెల్లితో అంది- “ ‘జరిగి’ అంటే నువ్వే, గిరిజ ని తిరగేసి అన్నారు బావగారు. ఇంగ్లీష్ లో రాసే ‘సత్యం’ కాస్త తిరగవేస్తే ‘మేటాస్’ అయ్యిందనీ ఇప్పుడంతా అంటారు గానీ, బావగారు ఇలాంటివి ముందే కనిపెట్టేరు” అని. అప్పుడు చెల్లెలు నవ్వేసింది. 2: ‘ఆధా హై చంద్రమా రాత్ ఆధీ’, ‘ఇక్ రాత్ మే దో దో చాంద్ ఖిలే – ఇక్ గూంఘట్ మే( , ఇక్ బదిలీ మే(’ 1: ఓహో, ఏ(విటి కథ, పింగళి నాగేంద్రరావు గారి వర్ధంతి కదా అని ‘వెన్నెలలోనే వేడి ఏలనో, వేడిమి లోనే చల్లనేలనో’ పాట పాడుకుంటూ వస్తావనుకుంటే , ఏకంగా సగం చంద్రుడు, రెండు చందమామలంటూ హిందీ లెక్కలు చెబుతున్నావ్ ఇవాళ! 2: అదే మన స్పెషాలిటీ. ఇవాళ ఓ ఖగోళ విశేషం జరగబోతోంది. కిందిటేడులాగే ఇవాళ చంద్రుడు సూపర్ మూన్ కాబోతున్నాడు. కన్యాకుమారిలో ఇలా సూర్యుడు అస్తమిస్తాడో లేదో చెంద్రుడు ఉదయించే ఘట్టం బావుంటుందని అంతా అక్కడికి పరుగులు తీస్తున్నారు. ట్రైన్ టిక్కెట్లు దొరక్క, తత్కాల్ క్యూలోని దళార్లకి మూడేసి వందలు పైగా చమురు పొయ్యలేక నా ప్రయాణం నా ఖర్మ అనుకుంటూ ఏదో ఇలా పాటలు పాడుకుంటూ గడిపేద్దామని నిశ్చయించుకున్నా. 1: మంచి పని చేశావ్. అయినా రోజూ కనిపించే చంద్రుణ్ణి ఏదో నిశితంగా పరిశీలిస్తున్నట్టు నీలాగే ఎందరో పోజు కొడతారు. ఏ కన్యనో, కుమారినో చూడ్డానికే గాని చంద్రుడి కోసం కానే కాదు. 2: ఎంత మాట అన్నావ్. 1: సరేగానీ, ఇందాక పాడేవే –ఆధా హై చంద్రమా అనీ. చెప్పు ఏ రాత్రి అలా చంద్రుడు కనిపిస్తాడు? 2: కవులంతా పున్నమి నాటి నిండు చంద్రుణ్ణి తలుచుకోవడం ఎరుగుదుం, అలాంటిది వీడెవడండీ బాబూ, సగం ముక్క అంటాడూ... హీరో గాని ఆష్ట్రనామరా? పూర్వ రంగం : ఇద్దరు స్నేహితుల మధ్య పాన ఘోష... 1:‘మత్త’ – అనే సంస్కృత అవ్యయం సంస్కృతార్ధంలో వాడితే ‘నా వలన’ అనే అర్ధం వస్తుంది. అదే ‘మత్త’ అనే విశేషణం ఉంది చూశావూ , మత్తెక్కినది, గర్వించినది అని అర్ధమిస్తుంది. అలా వచ్చి చేరినదే మన భాషలోని ‘మత్తు’ అనే వైకృత దేశ్య విశేష్యము. అంతేగానీ ‘నా వలన మత్తెక్కినది’ అని మాత్రం అనకు. ఎంత పార్టీ అయితే మటుకు పుచ్చుకోవడమేనా? నాలా మడి గట్టుకోవచ్చుగా? 2: అబ్బబ్బ, ఏదో చిన్న తప్పు చేస్తే మరీ దేవ భాష, మన భాష అన్నీ తీసుకొచ్చి నన్నిలా ఎద్దేవా చెయ్యడం నీకు తగదు సుమీ. 1: ఇప్పుడు సుమీ అంటున్నావు. నిన్న రాత్రి సునామీ. అవునా కాదా? అయినా నీకెలా గుర్తుంటుందిలే? అప్పుడు నీ స్టేజే వేరు. ఒకటే మంపు, ఒకటే కంపు! 2: మంపు అంటే? 1: అదే – మత్తు. 2: అలాగా ? కంపు అంటే వాసన, అంటే సువాసన అని పూర్వం కవులు పద్యాల్లో చెప్పేవారు. తెలుసా? 1:ఎవరికంపు వారికింపు. కంపు అనగానే శ్రీశ్రీ గారి ఛలోక్తి గుర్తొస్తుంది. ఆయన ఇలా అన్నారు- ‘ సిరిసిరి మువ్వ తరువాత చాలామంది శత’కంపు’ పద్యాలు రాస్తున్నారు’ . నవ్వేవా? సరే గానీ ప్ర.సా.దు తెలుసా? |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|